గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

Header Banner

గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

  Wed Sep 18, 2024 22:47        Gulf News

మెయిడ్ మార్కెట్ ఎపిసోడ్ 9: By - Ch. Raja Sekhar

ఏజెంట్ల మోసాలు

పోయిన భాగంలో ఏజెంట్ ఉచ్చులో పడి.. అక్కడికి వెళ్లి కష్టాలు పడి చివరికి ఏ పరిస్థితికి చేరారో తెలుసుకున్నాం.... ఇప్పుడు డబ్బు కోసం ఏజెంట్లు చేతిలో మోసపోయి అక్కడికి వెళ్లాక దిక్కుతోచని పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డారో తెలుసుకుందాం… 

 

నకిలీ ఏజెంట్ల భరతం పడతామంటూ పోలీసు, ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. జీవనోపాధి కోసం విదేశాల్లో పనులు కల్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తూ, బోగస్‌ వీసాలతో, లేని కంపెనీలను సృష్టిస్తూ, గల్ఫ్‌ ఏజెంట్లు చేస్తున్న మోసాలు అన్నీ ఇన్నీ కావు. చాలా వరకు ఈ ఏజెంట్ల ఆగడాలు వెలుగుచూస్తున్నా వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు చాలా తక్కువ. 

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నకిలీ ఏజెంట్లపై చర్యలకు పూనుకోకపోవడంతో ఏజెంట్ల మోసాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. తాజాగా ఒక ఏజెంట్‌ మోసానికి బలైన ఒకరు గల్ఫ్‌ దేశంలో చిక్కుకొని, తినడానికి కూడా తిండి లేక, ఏమి చేయాలో తోచక అటు సాంప్రదాయాన్ని వదిలేసి, వేశ్యా వృత్తిలోకి దిగి, అనారోగ్యం పాలై అక్కడ నుంచి బయటపడేందుకు నానా ఇబ్బందులు పడి చివరికి రెండు సంవత్సరాల తర్వాత స్వదేశానికి చేరుకున్నది.  

 

ఇంకా చదవండిశుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!  

 

ఇలాగే నరకయాతన పడ్డ మేడిపల్లి మండలా నికి చెందిన వాసంతి (ప్రైవసీ కోసం పేరు, ఊరు పేర్లు మార్చడం జరిగింది) గల్ఫ్‌ దేశానికి వెళ్లి, నానా కష్టాలు పడుతూ, సాయం కోసం వేయి కళ్ళతో ఆశగా ఎదురుచూసి, తరువాత ఎంతో కాలానికి గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన వాసంతి అనే మహిళ తన గోడును వెళ్లబోసుకుంది. వాసంతి గల్ఫ్ కి జాబ్‌ వీసాపై వెళ్ళింది. ఇందుకోసం అదే మండలానికి చెందిన ఏజెంట్‌ శ్రీనుకు, అన్నీ కలుపుకొని 85 వేల రూపాయలు ముట్టచెప్పింది. గల్ఫ్ హాస్పిటాలిటీ, హెచ్‌బీ బ్రాండ్స్‌ (పేరు మార్చడం జరిగింది) అనే కంపెనీలో ఉద్యోగం ఉందని, రోజుకు 8 గంటలు పని, ఉచిత భోజన సదుపాయం ఉందంటూ గల్ఫ్ కి పంపించాడు. తీరా అక్కడికి వెళ్లాక ఆమెకి కష్టాలు మొదలయ్యాయి. 

 

ఆమె వెళ్లింది జాబ్‌ వీసాపై కాదని, విజట్ వీసాపై అని తేలింది. ఈ వీసాపై ఉద్యోగం చేయడానికి వీలు లేదు. వాసంతి తన ఉద్యోగం కోసం ఏజెంట్‌ సూచించిన కంపెనీకి వెళ్లగా అక్కడ వారు పని కాదు కదా ఏకంగా ఆమెను ఒక భవనంలో నిర్బంధించారు. రోజుకు ఒక పూటే భోజనం పెడుతూ వచ్చారు. వారం తర్వాత ఆమెను వీసా కోసం ఇంటర్వ్యూ చేసిన అధికారి అక్కడకు రాగా ఆయన ఒక కంపెనీకి పంపించాడు. ఆ కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్లిన ఆమెకు 12 రోజుల పాటు ఎటువంటి పని కల్పించలేదు. అక్కడి నిబంధనల ప్రకారం పని చేసిన వారికి మాత్రమే భోజన వసతి కల్పిస్తారు అంట. దీంతో ఆమె తిండి కోసం తీవ్ర ఇక్కట్లు పడింది. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

చివరకు అమెని పనిలోకి తీసుకున్న కంపెనీ యాజమాన్యం 8 గంటలకు బదులు 10 నుంచి 11 గంటల పాటు పని చేయించుకోవడం, ఒక పూట భోజనం, అదీ చాలీచాలని తిండి పెడుతుండటంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. పనిచేసే శక్తి లేకపోవడంతో తన పరిస్థితి సూపర్‌వైజర్‌ దృష్టికి తీసుకుపోగా ఆయన నిస్సహాయత వ్యక్తం చేశాడు. మేనేజర్‌ దృష్టికి తీసుకుపోగా తామేమీ చేయలేమని, అసలు వీసానే ఒరిజినల్‌ కాదని, అయినా పని కల్పించామంటూ ఎదురుదాడి చేయడంతో ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పని చేసేందుకు ఓపిక లేకపోవడంతో ఉంటున్న గదికే పరిమితం కాగా భోజనం కూడా కరువైంది. పని చేసే సమయంలో అన్నంతో పాటు చైనా చికెన్‌ వంటివి సరఫరా చేసేవారు. పని కూడా లేకపోవడంతో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దిక్కుతోచని స్థితిలో నాలుగు ఇళ్ళల్లో పని అయినా చేసుకుందామని గల్ఫ్ ఇళ్ళకి బయల్దేరింది, కాని అక్కడి గల్ఫ్ లు ఆమెని శారీరకంగా వాడుకుని పని లేదని తరిమి కొట్టారు. 

 

ఇంకా చదవండిజగన్ స్క్రిప్ట్ తోనే హీరోయిన్ జెత్వానీపై కేసులు నమోదు! తప్పు చేసిన వారు ఎంతటి వ్యక్తులైనా! 

 

దీంతో ఆమె చివరకు ఇండియన్‌ ఎంబసీని ఆశ్రయించింది. చివరికి దాదాపారుల తర్వాత ఎంబసీ సహాయంతో తన ఇండియా రాగలిగింది. ఆ ఆరు నెలలు ఇండియన్ ఎంబసీ షెల్టర్ లో తలదాచుకొంది. ఈ విషయమై ఆమె మీడియా మాట్లాడుతూ, జీవనోపాధి కోసం గల్ఫ్ కి వచ్చి కష్టాలు పడుతున్నామని, ఏజెంట్ల మోసాలు కొనసాగుతున్నా పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిస్తే తన లాంటి వారు ఉపాధి కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, గల్ఫ్ దేశాలలో నేపాల్‌, ఇండియా తో పాటు పలు దేశాలకు చెందిన వారు తనలాగా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవాలంటూ ఆమె కోరుకున్నారు. 

 

మెయిడ్ మార్కెట్ ద్వారా కొంతమంది నిజాయితీతో చట్టబద్ధంగా నిజమయిన ఏజెంట్లలా పనిచేస్తుంటే, కొంతమంది ఇలా పెడ త్రోవ పట్టి భారత మహిళలని అధోగతి పాలు చేస్తున్నారు. గల్ఫ్ దేశాలలో అరబ్బుల ఇంట్లో మనవారు పనిమనిషిగా ఎలా మారుతున్నారు మరో భాగంలో తెలుసుకుందాం…

గల్ఫ్ మెయిడ్ మార్కెట్ ముందు భాగాలు: 

1. గల్ఫ్ లో పని మనుషుల కోసం జరిగే దంధా! ఖర్చులు ఎంత అవుతాయి! ఏజెంట్ల చేతిలో ఎందుకు మోసపోతున్నారు! 

 

2. గల్ఫ్ లో ఇంటి పని మనుషులుగా వెళ్లే మహిళలను హింసించే అరబ్బులు! వారికి ఎవరు అండ? ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకుని! 

 

3. గల్ఫ్ కి వెళ్లే తెలుగు ఆడపడుచులు మంత్రి లోకేష్ కు కాపాడమంటూ వీడియో మెసేజ్ లు ఎందుకు పెడుతున్నారు? సరైన మార్గంలో వెళ్ళడం వల్ల కలిగే ప్రయోజనాలు! ఆపద సమయంలో ఏం చేయాలి! 

 

4. గల్ఫ్ లో బతకడం ఇంత కష్టమా? పరిస్థితి చేజారి ఎంబసీకి వస్తే అక్కడ ఏం జరుగుతుంది? వేరే దారి లేక అక్కడ అలా జీవచ్చవాలై! 

 

5. గల్ఫ్ దేశాలకు పని మనిషిగా వెళ్లి కోటీశ్వరాలు అయిన ఆంధ్ర మహిళ! కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! అలాంటి వాళ్ళు చాలామంది!  

 

6. గల్ఫ్ లో పాలకి కూడా డబ్బులు లేక ఆకలితో అలమటిస్తున్న ఆ చిన్నారులు! పెద్దలు చేసిన పాపానికి ఆ 2సం//, 6 నెలల పిల్లలకు శాపమా? ఇల్లీగల్ సంతానమని భారతదేశ పౌరసత్వం ఇవ్వరా?

 

7. గల్ఫ్: లైవ్ లో ఒకటిన్నర సంవత్సరం బిడ్డతో తను కూడా క్లోరెక్స్ తాగి ఆత్మహత్యాయత్నం! అకామా లేదుబిడ్డకి పాస్పోర్ట్ లేదు! వదిలేసి పారిపోయిన భర్త! 

 

8. గల్ఫ్ లో ఏజెంట్ చేతిలో మోసపోయి అనాథగా మారిన ఆంధ్ర అమ్మాయి! ప్రాణం, మానం అర చేతిలో పట్టుకొని! దిక్కుతోచని పరిస్థితుల్లో!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!

 

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!

 

మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..

 

సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!

 

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌! వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌!

 

ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #MaidMarket #Gulf #GulfNews #GulfUpdates #Kuwait #Oman #SaudiArabia #Bahrain #Qatar