రూ.98 లక్షలు పోగొట్టుకున్నాను.. కాదంబరి కిరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఎలాగో తెలుసా?

Header Banner

రూ.98 లక్షలు పోగొట్టుకున్నాను.. కాదంబరి కిరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఎలాగో తెలుసా?

  Thu Sep 19, 2024 09:02        Entertainment

కమెడియన్ గా వందలాది సినిమాల్లో నటించి మెప్పించిన కాదంబరి కిరణ్ అందరికీ సుపరిచితమే. ఆయన నటుడు మాత్రమే కాదు రచయిత, దర్శకుడు కూడా. అయితే ప్రస్తుతం కిరణ్ సినిమాలు చేయడం లేదు. కానీ మనం సైతం ఫౌండేషన్ ద్వారా సినీ పరిశ్రమలోని వారికి తన వంతు సాయం చేస్తున్నారు. తాజాగా కాదంబరి కిరణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను అక్షరాల రూ.98 లక్షలు పోగొట్టుకున్నాను అని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. "నేను ఎన్నో సీరియల్స్ లో నటించాను. ఎన్నో సీరియల్స్ ఛానల్స్ వాళ్లు పని చేయించుకున్న తర్వాత నాకు డబ్బులు ఇవ్వలేదు. నాకు కేవలం 1 శాతం మంది మాత్రమే డబ్బులు ఇచ్చారు. 99 శాతం చానళ్లు డబ్బులు ఎగ్గొట్టాయి. ఒకరోజు కూర్చుని అన్ని లెక్కలు వేసుకుంటే రూ.98 లక్షలు రావాలి. అదంతా కేవలం నా రెమ్యూనరేషన్ మాత్రమే. ఆ డబ్బులు ఈ రోజుకు కూడా రాలేదు. నేను ఎంతగానో కష్టపడ్డాను. రూ.150 నుంచి నా  ప్రయాణాన్ని మొదలుపెట్టిన నేను అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాను. లెక్కలేనన్నిచోట్ల స్థలాలు కొన్నాను కానీ వాటినే మళ్లీ అమ్మేశాను.

 

ఇంకా చదవండి: జానీ మాస్టర్‌పై రేప్ కేసులో కీలక పరిణామం! పోక్సో చట్టం జత చేసిన పోలీసులు!

 

అప్పుడు నా మీద నాకే అసహ్యం పుట్టింది. నేనొక వాచ్ మన్ ని ఈ ఇండస్ట్రీలో, గుడ్ అండ్ బాడ్ ఇన్సిడెంట్ అన్నీ అందరికీ తెలియచెప్పాలని అనుకున్నాను. తెలుగు పరిశ్రమ వాచ్ మన్ గురించి కథ రాయాలని అనుకున్నాను. 20 నుంచి 25 పేజీల వరకు రాశాను కానీ ఆ తర్వాత నాకే బాధనిపించింది. వాళ్లు నాకు తెలిసిన వాళ్లే, ఆ తరువాత వాళ్లే నాకు స్నేహితులు అయ్యారు. అందుకే వాచ్ మన్ కథను అక్కడితో ఆపేశాను. మనం సైతం ఎలా పుట్టిందంటే... నా కష్టాలు నేను దాటి వచ్చిన తర్వాత నా బలం ఏంటో నేను తెలుసుకున్నాను. నా కుటుంబానికి నేను అండగా ఉండాలనుకున్నాను. నేను పేదవాడిగా ఎన్నో కష్టాలను అనుభవించాను. అందుకని పేదవాడికి సహాయం చేస్తే వారి కళ్ళల్లో కనిపించే కృతజ్ఞత భావం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అలా నా కుటుంబాన్ని పెంచుకుంటూ వెళ్లాలని వచ్చిన ఆలోచన మనం సైతం. చేతనైన సాయం కోసం ఎప్పుడైనా, ఎక్కడైనా మనం సైతం ముందుంటుంది. సాయం చేశాక నాకు వచ్చే ఆనందం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. 11 ఏళ్ళగా మనం సైతం ను నిర్వహిస్తున్నాను" అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు.

 

ఇంకా చదవండి: నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఇప్పటివరకు ఎవరూ ఊహించని టీడీపీ నిర్ణయం! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పేరు ఖరారు!

 

మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు శుభవార్త! ఎవరెవరికి బెనిఫిట్ కలుగుతుంది?Don't miss..

 

చెబితే మీరు నమ్మకపోవచ్చు గానీ! వైసీపీ గుట్టు రట్టు చేసిన భూమా అఖిల!

 

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!

 

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!

 

మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..

 

సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!

 

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌! వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌!

 

ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి!

 

ఇచ్చిన మాట నెర‌వేర్చిన మంత్రి లోకేశ్‌! ఆ ఊరు వారికి పండగే.. ఇక ఆ సమస్య లేనట్టే!!

 

ఈ మధ్య కాలంలో కనిపించని సీనియర్ నటి! మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టు వెల్లడి!

 

పరీక్ష లేకుండా నేరుగా రూ.4 లక్షల జీతంతో ఉద్యోగం! ఈ డాక్యుమెంట్లు తీసుకొని ఇక్కడికి వెళ్లండి!

 

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో కీలక భేటీ! పార్టీ బలోపేతంపై చర్చ!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! మరో పథకం పేరు మార్పు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #KadambariKiran #Actor #Tollywood