చంద్రయాన్‌-4కు గ్రీన్‌సిగ్నల్‌! కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు!

Header Banner

చంద్రయాన్‌-4కు గ్రీన్‌సిగ్నల్‌! కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు!

  Thu Sep 19, 2024 13:37        Technology

చంద్రుడిపైకి భారతీయ వ్యోమగాములను పంపేందుకు అవసరమైన సాంకేతికతల అభివృద్ధి, ప్రదర్శన కోసం చేపట్టనున్న ‘చంద్రయాన్‌-4’ మిషన్‌కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.2,104.06 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. శుక్రగ్రహాన్ని అధ్యయనం చేయడం కోసం దాని కక్ష్యలోకి వ్యోమనౌకను పంపించేందుకు చేపట్టనున్న ‘వీనస్‌ ఆర్బటర్‌ మిషన్‌'(శుక్రయాన్‌-1)కు రూ.1,236 కోట్లు కేటాయించింది. పాక్షిక పునర్వినియోగానికి అవకాశం ఉండే నెక్ట్స్‌ జెనెరేషన్‌ లాంచ్‌ వెహికిల్‌(ఎన్జీఎల్వీ)కి సైతం క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా కీలకమైన ఎన్జీఎల్వీతో పాటు మూడు డెవలప్‌మెంటల్‌ విమానాలు, ఇతర అవసరమైన సాంకేతికత అభివృద్ధి కోసం రూ.8,240 కోట్లు కేటాయించింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఇప్పటివరకు ఎవరూ ఊహించని టీడీపీ నిర్ణయం! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పేరు ఖరారు!

 

మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు శుభవార్త! ఎవరెవరికి బెనిఫిట్ కలుగుతుంది?Don't miss.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Technology #Space #Chandrayaan #India #ISRO