ఏపీ హోంమంత్రిని కలిసిన నటి కాదంబరి జెత్వానీ! దేశంలో ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ అధికారులు!

Header Banner

ఏపీ హోంమంత్రిని కలిసిన నటి కాదంబరి జెత్వానీ! దేశంలో ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ అధికారులు!

  Thu Sep 19, 2024 17:22        Politics

ముంబయి నటి కాదంబరి జెత్వానీ ఇవాళ విజయవాడలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. అనంతరం ఆమె తన న్యాయవాదితో కలిసి మీడియాతో మాట్లాడారు. హోంమంత్రి అనితతో తన కష్టాలు చెప్పుకున్నానని జెత్వానీ వెల్లడించారు. గతంలో పోలీసులు తనతో వ్యవహరించిన తీరును వివరించానని, కేసు విచారణ వేగవంతం చేయాలని కోరానని తెలిపారు. విజయవాడలో ఉన్న సమయంలో తనకు రక్షణ కల్పించాలని కోరానని జెత్వానీ పేర్కొన్నారు. తనపై కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేశానని వెల్లడించారు. హోంమంత్రి తనకు భరోసా ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా జెత్వానీ న్యాయవాది మాట్లాడుతూ, దేశంలో ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అవడం జాతీయ స్థాయిలో సంచలనం కలిగించిందని, అది ఈ కేసు తీవ్రతకు నిదర్శనం అని వివరించారు. 

 

ఇంకా చదవండి: ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

జెత్వానీ నుంచి తీసుకున్న ఐఫోన్లను కోర్టులో సమర్పించకుండా, ఆ ఫోన్లలోని డేటాను తెరిచే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అవి ఐఫోన్లు కాబట్టి, వాటిలో అత్యంత భద్రత ప్రమాణాలు ఉంటాయి కాబట్టి సరిపోయిందని, మామూలు ఫోన్లు అయ్యుంటే ఈపాటికి ఓపెన్ చేసి ఉండేవాళ్లని తెలిపారు. ఐఫోన్లను తెరవడానికి ప్రయత్నించినప్పుడు జెత్వానీకి రెండు సార్లు అలర్ట్ మెసేజ్ లు వచ్చాయని, వాటిని సాక్ష్యాలుగా చూపిస్తామని పేర్కొన్నారు. జెత్వానీ సోదరుడిపై జారీ చేసిన లుకౌట్ నోటీసులు వెనక్కి తీసుకున్నారని, ఆమెపై పెట్టిన అక్రమ కేసును కూడా వెనక్కి తీసుకుంటే బాగుంటుందని అన్నారు. ఈ కేసులో ఉన్న పెద్దలు ఎవరన్నది మీడియా ద్వారా ఇప్పటికే బయటికి వచ్చిందని, కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్నది కూడా మీడియా ద్వారా తేటతెల్లమైందని జెత్వానీ న్యాయవాది వివరించారు. ముంబయిలో కేసును మూసివేయడం కోసమే ఈ తతంగం అంతా జరిగిందన్నది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు.

 

ఇంకా చదవండి: నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

 

వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఇప్పటివరకు ఎవరూ ఊహించని టీడీపీ నిర్ణయం! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పేరు ఖరారు!

 

మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు శుభవార్త! ఎవరెవరికి బెనిఫిట్ కలుగుతుంది?Don't miss..

 

చెబితే మీరు నమ్మకపోవచ్చు గానీ! వైసీపీ గుట్టు రట్టు చేసిన భూమా అఖిల!

 

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!

 

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!

 

మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..

 

సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!

 

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌! వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌!

 

ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి!

 

ఇచ్చిన మాట నెర‌వేర్చిన మంత్రి లోకేశ్‌! ఆ ఊరు వారికి పండగే.. ఇక ఆ సమస్య లేనట్టే!!

 

ఈ మధ్య కాలంలో కనిపించని సీనియర్ నటి! మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టు వెల్లడి!

 

పరీక్ష లేకుండా నేరుగా రూ.4 లక్షల జీతంతో ఉద్యోగం! ఈ డాక్యుమెంట్లు తీసుకొని ఇక్కడికి వెళ్లండి!

 

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో కీలక భేటీ! పార్టీ బలోపేతంపై చర్చ!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! మరో పథకం పేరు మార్పు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #KadambariJethwani #VangalapudiAnitha #Vijayawada #Police #AndhraPradesh