అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్! ఫ్లైఓవర్ పైనుండి పడిపోయినా కూడా...

Header Banner

అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్! ఫ్లైఓవర్ పైనుండి పడిపోయినా కూడా...

  Sat Sep 21, 2024 19:29        India

కారు ఢీ కొట్టడంతో ఓ మహిళ ఫ్లైఓవర్ పిల్లర్ పై పడిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. నోయిడాలో ఓ మహిళ సెక్టార్-18 నుంచి సెక్టార్-62 వైపు వెళ్లేందుకు ఎలివేటెడ్ రహదారిపై స్కూటీలో ప్రయాణిస్తుంది. అయితే ఆమె ప్రయాణిస్తున్న స్కూటీని అకస్మాత్తుగా ఓ కారు వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఆ మహిళ గాల్లో ఎగిరి ఫ్లైఓవర్ మధ్యలో ఉన్న సందులో పడిపోయింది. అదృష్టవశాత్తు కింద పడకుండా పిల్లర్ పైన పడటంతో ఆ మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. అయితే ఆ మహిళను రక్షించేందుకు మరో ఇద్దరు యువకులు ఫ్రైఓవర్ పిల్లర్ పైకి దిగి వారు కూడా దాదాపు గంటకు పైగా అక్కడే చిక్కుకుపోయారు.

 

ఇంకా చదవండిగల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండి: మద్దిరాలపాడులో సీఎం చంద్రబాబు పర్యటన! అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన! 

 

దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కింద పడి ఉంటే మరణించి ఉండేదని, వెంట్రుక వాసిలో ప్రాణాలు నిలుపుకుందని, అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ ఆ మహిళ అని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని, హైడ్రాలిక్ ప్లాట్ ఫారమ్ ద్వారా ఆ మహిళ సహా ఇద్దరు యువకులను కిందికి దించారు. అనంతరం ఆ మహిళను హస్పిటల్ కు తరలించారు. దీనిపై నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ మనీష్ మిశ్రా మాట్లాడుతూ.. పిల్లర్ పై చిక్కుకున్న మహిళ స్వల్ప గాయాలతో బయటపడిందని, మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, దీనిపై దర్యాప్తు చేపట్టి నిందితులను కనిపెడతామని వెల్లడించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా.. తాట తీస్తా! చంద్రబాబు వార్నింగ్! ఈ సైకోలకు ప్రభుత్వం అంటే!

 

వైసీపీ మాజీ మంత్రి కొన్ని కోట్లు వసూలు! ఎవరి దగ్గర - ఎంతంటే! ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజాలు!

 

సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు.! ప్రకాశం పర్యటన ఖరారు! ఎందుకో తెలుసా?

 

ఉండేదెవరు..పోయేదెవరు..జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా! 

 



   #AndhraPravasi #India #UttarPradesh #Noida #Accident