ఆ ఐదు నగరాల్లో జరిగే దీపావళి సెలెబ్రేషన్స్‌ సమ్‌థింగ్‌ స్పెషల్! ఎందుకో తెలుసా?

Header Banner

ఆ ఐదు నగరాల్లో జరిగే దీపావళి సెలెబ్రేషన్స్‌ సమ్‌థింగ్‌ స్పెషల్! ఎందుకో తెలుసా?

  Wed Oct 30, 2024 14:10        India

సాధారణంగా ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళి పండుగ చేసుకుంటారు. ఈ దీపావళి పండుగనే దీపాల పండుగ, దివ్వెల పండుగ అని కూడా అంటారు. మంచిపై చెడు విజయానికి గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధించి చీకటిమయమైన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పండుగ నాడు ప్రతి ఇంటి ముంగిట దీపాలు వెలిగిస్తారు. బాణా సంచా కాలుస్తారు. స్వీట్లు పంచుతారు. ఇదిలావుంటే దేశంలోని ఓ ఐదు నగరాల్లో మాత్రం ఈ పండుగను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

 

శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య దీపావళి వేడుకలకు ప్రత్యేక కేంద్రంగా మారింది. ఇక్కడ ఏటా దీపోత్సవ్‌ పేరుతో దీపావళి పండుగ జరుపుకుంటారు. సరయూ నది ఒడ్డున లక్షలాది దీపాలు వెలిగిస్తారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రేక్షకులను ఇవి మంత్రముగ్ధులను చేస్తాయి.

 

వారణాసిలో కూడా దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. లక్షల దీపాలతో అలంకృతమైన గంగా ఘాట్‌లపై హారతి నిర్వహిస్తారు. వారణాసిలోని అన్ని ఘాట్‌లు, దేవాలయాలు కాంతులతో నిండిపోతాయి. బాణాసంచా వెలుగులు అలరింపజేస్తాయి.

 

ఇంకా చదవండిషాకింగ్ న్యూస్: లాడ్జ్‌లో ప్రియురాలితో ఎంపీడీవో.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య, పిల్లలు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

గోవాలో దీపావళిని ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని దీపావళి రాత్రి నరకాసురుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. అందుకు ముందుగా భారీ దిష్టిబొమ్మలను ఏర్పాటు చేస్తారు. సాంప్రదాయ సంగీతం, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు.

 

కోల్‌కతాలో దీపావళి పండుగ సందర్భంగా కాళీ పూజలను కూడా నిర్వహిస్తారు. కాళీ పూజల కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ పందిళ్లను ఏర్పాటు చేస్తారు. వీధులు, ఇళ్లు, దేవాలయాలను దీపాలతో అలంకరిస్తారు. అంగరంగ వైభవంగా పండుగ జరుపుకుంటారు.

 

కోల్‌కతాలో దీపావళి పండుగ సందర్భంగా కాళీ పూజలను కూడా నిర్వహిస్తారు. కాళీ పూజల కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ పందిళ్లను ఏర్పాటు చేస్తారు. వీధులు, ఇళ్లు, దేవాలయాలను దీపాలతో అలంకరిస్తారు. అంగరంగ వైభవంగా పండుగ జరుపుకుంటారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

 

USA: ప్రపంచంలోనే అతి పెద్ద డేటా కంపెనీని సందర్శించిన మంత్రి లోకేష్! పెట్టుబడికి సుముఖం! ఎన్ని కోట్లు అంటే!

 

ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!

 

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!

 

దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: ఆ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు - వారికి పండగే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Diwali