దీపావళికి టపాసులు కాలుస్తున్నారా? వీరు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు!

Header Banner

దీపావళికి టపాసులు కాలుస్తున్నారా? వీరు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు!

  Wed Oct 30, 2024 13:26        Life Style

ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకునే దీపావళి సందడి ఇప్పటికే మొదలైంది. టపాసులతో, రకరకాల బొమ్మలతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ఇక పండుగ రోజైతే వెలుగు జిలుగుల దీపకాంతులతో, బాణా సంచా మోతలతో ఇండ్లు, వీధులు వెలుగుల్ని విరజిమ్ముతాయి. అయితే బాణా సంచా వల్ల వెలువడే శబ్ద, వాయు కాలుష్యాలతో వాతావరణమే మరోలా మారిపోచ్చు. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే బాణాసంచాల కాల్చడం ద్వారా వెలువడే కాలుష్యాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారిపై ఈ ప్రభావం మరింత అధికంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

 

ఇంకా చదవండిషాకింగ్ న్యూస్: లాడ్జ్‌లో ప్రియురాలితో ఎంపీడీవో.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య, పిల్లలు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

పటాకులు కాల్చడంవల్ల దాదాపు 80 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం విడుదల అవుతుంది. దీనికి గురైతే చెవుడు, రక్తపోటు, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాగే పిల్లలు, గర్భిణులు అధిక శబ్దాలు వినడంవల్ల తలనొప్పి, వికారం, వాంతులు వంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. కాలుష్యం నిండిన పొగ కారణంగా దగ్గు, కళ్లల్లో మంట, చర్మంపై దద్దుర్లు వంటివి ఏర్పడవచ్చు. పటాకుల్లో ఉండే కెమికల్స్ మూలంగా చర్మం పొడిబారడమే కాకుండా స్కిన్ అలెర్జీలు తలెత్తుతాయి. కాబట్టి పండుగ రోజు వాయు, శబ్ద కాలుష్యాల నుంచి జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు ఎక్కువ కేర్ తీసుకోవాలి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

 

USA: ప్రపంచంలోనే అతి పెద్ద డేటా కంపెనీని సందర్శించిన మంత్రి లోకేష్! పెట్టుబడికి సుముఖం! ఎన్ని కోట్లు అంటే!

 

ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!

 

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!

 

దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: ఆ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు - వారికి పండగే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #LifeStyle #Crackers