దీపం-2 పథకంలో పేద ప్రజలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు! సీఎం చంద్రబాబు రూ.894 కోట్లు విడుదల!

Header Banner

దీపం-2 పథకంలో పేద ప్రజలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు! సీఎం చంద్రబాబు రూ.894 కోట్లు విడుదల!

  Wed Oct 30, 2024 15:40        Politics

సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పథకానికి ఖర్చయ్యే నిధులను సీఎం చంద్రబాబు పెట్రోలియం సంస్థలకు అందజేశారు. అమరావతిలోని సచివాలయంలో హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి ఈ సబ్సిడీ మొత్తాన్ని అందించారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేందుకు అయ్యే రూ.2,684 కోట్ల ఖర్చుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో మొదటి ఉచిత సిలిండర్కు ఖర్చు అయ్యే రూ.894 కోట్లను పెట్రోలియం సంస్థలకు ప్రభుత్వం అందించింది.
దీపం-2 పథకంలో భాగంగా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా అందించనుంది. మూడు విడతల్లో ప్రభుత్వం మూడు గ్యాస్ సిలిండర్లకు అయ్యే ఖర్చు సొమ్మును విడుదల చేయనుంది. 29వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్ని లబ్ధిదారులకు కల్పించింది. గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారులు సిలిండర్కు వెచ్చించిన సొమ్ము వారి ఖాతాలో జమ కానుంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

 

USA: ప్రపంచంలోనే అతి పెద్ద డేటా కంపెనీని సందర్శించిన మంత్రి లోకేష్! పెట్టుబడికి సుముఖం! ఎన్ని కోట్లు అంటే!

 

ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!

 

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!

 

దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: ఆ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు - వారికి పండగే!

 
ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 



   #andhrapravasi #supersix #gascylinder #freegas #todaynews #flashnews #latestupdate