2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఏపీ! నీతి ఆయోగ్ సీఈఓతో సీఎం చంద్రబాబు భేటీ!

Header Banner

2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఏపీ! నీతి ఆయోగ్ సీఈఓతో సీఎం చంద్రబాబు భేటీ!

  Wed Oct 30, 2024 17:51        Politics

విజన్ డాక్యుమెంట్ 2047కు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం సమావేశమై చర్చించారు. అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఈ భేటీలో నీతి ఆయోగ్కు సంబంధించిన సలహాదారు, డైరెక్టర్లతోపాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 ప్రణాళిక రూపొందించినట్లు సీఎం చంద్రబాబు వివరించారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఏపీ అభివృద్ధే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ను రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో రూపొందించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వ్యవసాయం, ఆక్వా తదితర రంగాల్లో అభివృద్ధి సాధించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు సీఎం నీతిఆయోగ్ సీఈఓకు వివరించారు. పేదరిక నిర్మూలన, ఈజ్ ఆఫ్ లివింగ్, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, డెమోగ్రాఫిక్ మేనేజిమెంట్, డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి గ్రోత్ ఇంజిన్లతో వృద్ధిరేటు సాధించేలా ఈ ప్రణాళికలు రూపొందాయని, వీటిని సమర్థంగా అమలు చేసేలా కార్యాచరణ చేసినట్లు సీఎం తెలిపారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

 

USA: ప్రపంచంలోనే అతి పెద్ద డేటా కంపెనీని సందర్శించిన మంత్రి లోకేష్! పెట్టుబడికి సుముఖం! ఎన్ని కోట్లు అంటే!

 

ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!

 

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!

 

దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: ఆ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు - వారికి పండగే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 



   #andhrapravasi #development #economy #CMvision #nitiayojana #meetings #todaynews #flashnews #latestupdate