కన్ఫర్మ్ అయిన టీటీడీ ఛైర్మన్ పోస్ట్! బోర్డు మెంబర్లలో ఎన్నారైలు కూడా!
Wed Oct 30, 2024 19:51 Politicsతిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నూతన చైర్మన్ గా శ్రీ బొల్లినేని రాజగోపాల్ నాయుడు (72 సం) నియమితులయ్యారు. టీవీ5 చైర్మన్ గా ఇరు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులైన బిఆర్ నాయుడు స్వయంకృషి, పట్టుదల, ఆధ్యాత్మిక నిబద్దతకూ ప్రతీక. మీడియా సంస్థ యజమానిగా, వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ స్పృహ ఉన్న పౌరుడిగా బీఆర్ నాయుడు సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు టిటిడి బోర్డు చైర్మన్ గా బిఆర్ నాయుడు నియామకాన్ని ఆమోదించి అభినందనలు తెలిపారు. బోర్డు మెంబర్లలో ఎన్నారైలు కూడా ఉన్నట్లు సమాచారం అందింది అందులో శివ జాస్తి ఒకరు.
టీటీడీ బోర్డు మెంబర్ల లిస్ట్
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం దిగువ పూనేపల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శ్రీ బి ఆర్ నాయుడు చిన్నతనం నుంచి పట్టుదల స్వయంకృషితో ఎదిగారు. తల్లిదండ్రులు మునిస్వామి నాయుడు- లక్ష్మిల ఆరుగురు సంతానంలో చివరివాడైన బి ఆర్ నాయుడు చిన్నతనం నుంచి ఏదో సాధించాలన్న తపనతో కృషి చేసేవారు. స్థానికంగా చదువు పూర్తి చేసిన శ్రీ నాయుడు తరువాత సాంకేతిక విద్య నేర్చుకొని బీహెచ్ఎల్- హైదరాబాదులో ఉద్యోగంలో చేరారు. యువ ఉద్యోగిగా బీహెచ్ఈఎల్ సాంస్కృతిక, సాహిత్య విభాగాల్లోనూ చాలా చురుకుగా పనిచేశారు. 12 వేలమంది ఉద్యోగులు ఉండే బిహెచ్ఐఎల్ సంస్థలో లిటరరీ సెక్రటరీగా, సాంస్కృతిక కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు. ఉద్యోగుల తరఫున సాహిత్య సాంస్కృతిక అంశాలపై ఒక ప్రత్యేక పక్ష పత్రిక కూడా బిఆర్ నాయుడు నడిపారు. ఉద్యోగుల వెల్ఫేర్, ఇతర అంశాలపై కూడా చాలా సామాజిక స్ప్రుహతో మెలిగేవారు. బి ఆర్ నాయుడు సతీమణి విజయలక్ష్మి కూడా బీహెచ్ఎల్ లోనే పనిచేసారు.
బిహెచ్ఐఎల్ లో పనిచేస్తున్న సమయంలోనే ఎన్టీ రామారావు రాజకీయ రంగ ప్రవేశాన్ని బలంగా కోరుకున్నారు. ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయనను పదవి నుంచి తప్పించేందుకు జరిగిన ప్రయత్నాలను బీఆర్ నాయుడు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ కొనసాగాలని కోరుతూ "ప్రజాస్వామ్య పునరుద్ధరణ" పేరున జరిగిన భారీ సభలు, ర్యాలీలు నిర్వహించిన సమయంలోనే శ్రీ బి.ఆర్ నాయుడు శక్తి వంచన లేకుండా చేసిన కృషితో చంద్రబాబుకు దగ్గరయ్యారు. అప్పటినుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ స్థానికంగా ప్రజా ప్రతినిధిగా కూడా పనిచేశారు.
ఇంకా చదవండి: షాకింగ్ న్యూస్: లాడ్జ్‌లో ప్రియురాలితో ఎంపీడీవో.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య, పిల్లలు!
నిరంతర కృషివలుడైన శ్రీ బీఆర్ నాయుడు తర్వాత తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వ్యాపార రంగంలో ప్రవేశించారు. ట్రావెల్ క్లబ్ పేరున ఎయిర్ టికెట్ వ్యాపారంలో ప్రవేశించిన బిఆర్ నాయుడు అంచలంచలుగా ఎదుగుతూ తర్వాత టీవీ5, హిందూ ధర్మం, నూజెన్ హెర్బల్స్ లాంటి సంస్థలను స్థాపించి తన వ్యాపారాన్ని విస్తరించారు.
విద్యార్థి దశ నుంచి రాజకీయాలు, సామాజిక అంశాల పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తిగా ప్రజలకు నిస్పాక్షిక మీడియా అవసరాన్ని గుర్తించి టీవీ5 తెలుగు న్యూస్ ఛానల్ ని ప్రారంభించారు. 2007 గాంధీ జయంతి రోజున ప్రారంభమైన టీవీ5 తమ మూల సిద్ధాంతమైన కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం ఇలాంటి అంశాలపై పూర్తి నిబద్ధతతో పనిచేస్తోంది. ప్రభుత్వం ఏదైనా ప్రజా సమస్యలపై మొక్కవోని నిబద్ధతతో ప్రజల పక్షాన నిలిచింది. కొన్నిసార్లు ప్రభుత్వాలు తనపై, తన మీడియా సంస్థపై, ప్రత్యక్షంగా పరోక్షంగా కక్ష సాధింపులకు దిగినా బిఆర్ నాయుడు ఏమాత్రం వెరవకుండా ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా ధైర్యంగా నిలబడ్డారు. వార్తా ప్రసారాలతో తెలుగు ప్రజలకు చేరువైన టీవీ5 తరువాత టీవీ5 కన్నడ, టీవీ5 యూఎస్ఏ, హిందూ ధర్మం లాంటి నూతన చానళ్లను స్థాపిస్తూ ప్రజలకు మరింత చేరువైంది.
తెలుగు రాష్ట్రాల ప్రగతిని, ప్రజాస్వామ్య విలువలను కాంక్షించే శ్రీ నాయుడు. కేవలం ఓ ఛానల్ యజమానిగా మాత్రమే ప్రజాసమస్యలను వినిపించేందుకు పరిమితం కాలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఓ ప్రపంచ స్థాయి నంగరం రాజధాని ఉండాలనే విధానాన్ని బలంగా సమర్థించారు. అమరావతి రాజధాని కలను గత ప్రభుత్వం తుంచేందుకు చేసిన ప్రయత్నాన్ని బీఆర్ నాయుడు నిర్భీతిగా వ్యతిరేకించారు. అమరావతి రాజధాని ఉధ్యమాన్ని సమర్ధించినందుకు నాటి ప్రభుత్వం 70 ఏళ్ల వయసులో తనపై రాజద్రోహం కేసులు మోపినా మొక్కవోని ధైర్యంతో ప్రజల పక్షాల నిలిచారు. అనేక ప్రజావ్యతిరేక విధానాలను టీవీ 5 ద్వారా ఎండగట్టినందుకు బీఆర్ నాయుడు ఆర్దికంగా, వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు పడాల్సివచ్చినా ఏనాడూ వెనకడుగు వేయలేదు.
స్వతహాగా వెంకటేశ్వర స్వామి భక్తుడైన శ్రీ బీఆర్ నాయుడు ముందు నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించే విధంగా హిందు ధర్మ ప్రచార నిమిత్తం "హిందూ ధర్మం" పేరుతో 2018 సం.లో ఓ ప్రత్యేక ఆధ్యాత్మిక ఛానల్ స్థాపించారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పుణ్యక్షేత్రాల నుంచి జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివిధ క్షేత్రాల మహాతమ్యాలు, దేశంలోని అందరు పీఠాధిపతుల ప్రబోధాలను హిందూ ధర్మం ప్రత్యేకంగా ప్రసారం చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను హిందూ ధర్మం ద్వారా యావత్ తెలుగు ప్రజలకు చేరువచేసే ప్రయత్నం బీఆర్ నాయుడు చేస్తున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ హిందూ భక్తుడికీ అత్యంత ప్రీతిపాత్రమైన శివవార్వతులు కళ్యాణం నిర్వహణ బీ ఆర్ నాయుడు కుటుంబానికి చాలా ప్రత్యేకమైనది. ప్రతీ సంవత్సరం కార్తీక మాసంలో టీవీ5- హిందూధర్మం ఛానళ్లు సంయుక్తంగా నిర్వహించే శివపార్వతులు కళ్యాణం అత్యంత ప్రతిష్టాత్మంకంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా వ్యయ ప్రయాసలకు ఏమాత్రం వెరవకుండా సుప్రసిద్ద కాశీ మహాక్షేత్రం మొదలు కర్ణాటకలోని దావణగెరె నుంచి తెలుగు రాష్ట్రాల్లో ని 12 ప్రదాన పట్టణాల్లో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. భక్తులకు పూర్తి ఉచితంగా పూజా, ప్రసాదాలు అందించడంతో పాటు వారిని పూర్తిగా ఆధ్యాత్మిక లోకంలో ఓలలాడిస్తూ హిందూధర్మ ప్రచారంలో తనవంతు పాత్రను ఈ కార్యక్రమం ద్వారా బీఆర్ నాయుడు పుష్కరకాలంగా చేస్తున్నారు.
కేవలం ఒక మీడియా అధిపతి గాను వ్యాపారవేత్తగాను మాత్రమే కాకుండా బిఆర్ నాయుడు సామాజిక సేవ రంగంలోనూ తనదైన పాత్ర పోషిస్తున్నారు. శ్రేయ ఫౌండేషన్ పేరుతో ఇరు తెలుగు రాష్ట్రాల్లోని అనేకమంది పేదలకు గ్రహణమొర్రి, కంటి ఆపరేషన్లు వంటి సేవలు ఉచితంగా అందించారు. కోవిడ్ సమయంలో ఇబ్బందులు పడిన వందలాదిమంది పేదలకు బిఆర్ నాయుడు తన సంస్థ ద్వారా భూరి విరాళాలు అందించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నూతన చైర్మన్గా బాధ్యతలు చేపట్టబోతున్న బి. ఆర్ నాయుడు వెంకటేశ్వర స్వామి సేవకు ఎప్పుడో అంకితమయ్యారు. చిత్తూరు జిల్లాలోనే పుట్టి పెరిగిన వ్యక్తిగా, చిన్నతనం నుంచి వెంకటేశ్వరుడి దైవ సన్నిధానంలో జరుగుతున్న కార్యకలాపాలను స్వయంగా తెలిసిన స్థానికుడిగా ఈ పదవి కి బిఆర్ నాయుడు అన్ని విధాలుగా అర్హులు. దేవస్థాన ధార్మిక కార్యకలాపాలు, ఆగమ శాస్త్రాల ప్రాధాన్యత, హిందూ ధర్మ పరిరక్షణ, భక్తుల మనోభావాలు స్థానికుల అవసరాలు అన్నీ తెలిసిన వ్యక్తిగా టిటిడి బోర్డు చైర్మన్గా తన లభించే ఈ పదవిని పూర్తి చిత్తశుద్ధితో నిర్వహిస్తానని బిఆర్ నాయుడు చెప్పారు. ముఖ్యంగా గడిచిన ప్రభుత్వ కాలంలో ఏడుకొండల వాడి సాక్షిగా జరిగిన అనేక తప్పుడు నిర్ణయాలను సరి చేయడం, దేవస్థాన అభివృద్ధి, వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యాన్ని సామాన్యుడికి సైతం సులువుగా అందించే మార్గం వేసిన తన ప్రాధాన్యత అని నాయుడు చెప్పారు. తన పదవీకాలంలో పూర్తి పారదర్శకత, ధార్మిక చిత్తశుద్ధితో వెంకటేశ్వర స్వామి సేవ చేసేందుకు కంకణబద్ధున్నై ఉన్నానని బిఆర్ నాయుడు తెలిపారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!
ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!
దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #India #TTD #Tirumala #Politics
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.