శివలింగాలతో పూర్ణత పొందిన వాల్మీకి గుహలు! పర్యాటకులను ఆకట్టుకుంటున్న సహజ అద్భుతాలు!

Header Banner

శివలింగాలతో పూర్ణత పొందిన వాల్మీకి గుహలు! పర్యాటకులను ఆకట్టుకుంటున్న సహజ అద్భుతాలు!

  Sun Nov 24, 2024 12:00        Others

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం బోయవాండ్లపల్లెలో వాల్మీకి గుహలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సహజసిద్ధంగా ఏర్పడ్డ గుహల్లోకి మార్గబిలం ద్వారా కిందికి చేరుకునేలా అభివృద్ధి చేశారు. కొద్దిదూరం వెళ్లాక విశాలమైన మైదానం ఉంటుంది. ఏడు బావులుగా స్థానికులు పిలుచుకునే ఈ ప్రాంతంలో ఇప్పటివరకు పర్యాటకులు ఐదు బావుల వద్దకే వెళ్లగలిగారు. ఏడో బావి ప్రాంతాన్ని కైలాసంగా భక్తులు విశ్వసిస్తారు. నిచ్చెన సాయంతో 30 నుంచి 40 అడుగుల లోయలో వెళితే తప్ప బావులను చూడటం సాధ్యం కాదు. గుండుసూది పడినా కనిపించేంత స్పష్టంగా, స్వచ్చంగా బావుల్లో నీరుంటుంది. గుహలో అడుగడుగునా శివలింగాలు దర్శనమిస్తాయి. గుహల్లోని శివలింగాలను వాల్మీకి మహర్షి పూజించారని, అందుకే వాల్మీకి గుహలుగా పేరొందాయని పురాణగాథ. ఆవు పొదుగులా జాలు వారినట్లు కొన్నిచోట్ల, నక్షత్రాలు కిందికి దిగినట్లున్న శిలలు మరికొన్ని ప్రాంతాల్లో కనువిందు చేస్తుంటాయి. కింది భాగంలో కొలను వద్ద శిల నంది విగ్రహాన్ని పోలి ఉంటుంది. నంది పైభాగంలో చొచ్చుకొచ్చినట్లున్న శిలను మీటితే గంట మోగినట్లు శబ్దం వస్తుంది. పక్కనే ఉన్న మరో శిలను మీటితే ఎలాంటి శబ్దమూ రాదు. గతంలో జర్మనీ శాస్త్రవేత్తలు ఈ గుహలపై పరిశోధనకు ప్రయత్నించినట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతానికి చేరుకునేందుకు రైళ్లు, బస్సుల్లో డోన్కు చేరుకోవాలి. అక్కడినుంచి బోయవాండ్లపల్లె మీదుగా వెళ్లే బస్సుల్లో ప్రయాణించాలి.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!

 

శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!

 

ఈరోజు 23/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసిందిగత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #andhrapravasi #nandhyala #boyavandlapalli #caves #valmikicaves #todaynews #flashnews