విజయవాడలో వ్యాపార అభివృద్ధికి బిజినెస్ ఎక్స్పో! ఎన్డీయే పారిశ్రామిక విధానాలకు ప్రతిభావంతమైన ప్రదర్శన!

Header Banner

విజయవాడలో వ్యాపార అభివృద్ధికి బిజినెస్ ఎక్స్పో! ఎన్డీయే పారిశ్రామిక విధానాలకు ప్రతిభావంతమైన ప్రదర్శన!

  Sun Nov 24, 2024 13:12        Business

రాష్ట్రంలోని అపారమైన వ్యాపార అవకాశాలను ప్రచారం చేయాలనే లక్ష్యంతో ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు బిజినెస్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు తెలిపారు. ప్రభుత్వం మారిన తర్వాత ఏపీలో పరిస్థితులు మారాయని, వాటిని ప్రజలకు, వ్యాపారవేత్తలకు వివరిస్తామని చెప్పారు. విజయవాడలోని ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఫెడరేషన్ కార్యాలయంలో శనివారం విలేకర్లతో భాస్కరరావు మాట్లాడారు. 'రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఎన్నో కొత్త విధానాలను తీసుకొచ్చింది. స్థానిక ఉత్పత్తులు, పరిశ్రమల అభివృద్ధి, వ్యాపార అవకాశాలకు ఉన్న సానుకూలతల గురించి అందరికీ వివరించాలనే ఉద్దేశంతో విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో బిజినెస్ ఎక్స్పో నిర్వహిస్తున్నాం. ఇందులో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల పారిశ్రామికవేత్తలు సానుకూలంగా స్పందించారు. ఎన్డీయే ప్రభుత్వ స్నేహపూరిత పారిశ్రామిక విధానాలను చూసి, ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన కన్పిస్తోంది. 160 స్టాల్స్ ఏర్పాటుచేస్తాం. ఎక్స్పోలో రోజూ మూడు రంగాలపై నిపుణులతో ఉచితంగా సెమినార్లు నిర్వహిస్తాం. తొలిరోజు ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యాంకింగ్ ఫైనాన్స్, రెండో రోజు ప్రారంభిస్తారు. మంత్రి లోకేశ్తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు' అని వివరించారు. సమావేశంలో ఏపీ ఛాంబర్స్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, మాజీ అధ్యక్షుడు మురళి తదితరులు పాల్గొన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!

 

శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!

 

ఈరోజు 23/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసిందిగత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #andhrapravasi #businessexpo #vijayawada #industry #fedaration #banking #finance #automobile #businessman #todaynews #flashnews #latestupdate