పార్లమెంట్‌ను కుదిపేస్తోన్న అదానీ వ్యవహారం! ఉభయసభలు 12 గంటల వరకు వాయిదా!

Header Banner

పార్లమెంట్‌ను కుదిపేస్తోన్న అదానీ వ్యవహారం! ఉభయసభలు 12 గంటల వరకు వాయిదా!

  Thu Nov 28, 2024 11:42        India

అదానీ వ్యవహారం పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను కుదిపేస్తోంది. అమెరికాలో అదానీ సంస్థపై నమోదైన కేసు, ఈ సంస్థపై వచ్చిన ఆరోపణలపై చర్చకు ప్రతిపక్ష సభ్యులు పట్టుబడుతున్నారు. ఈ వ్యవహారంతో రెండు రోజులుగా ఉభయసభల్లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇక గురువారం మూడో రోజు కూడా అదే పరిస్థితి నెలకొంది.

 

ఇంకా చదవండిఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల! కూటమి కీలక స్థాయికి చేరిక!

 

గురువారం ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే ఇటీవలే జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వయనాడ్‌ ఎంపీగా ప్రియాంక గాంధీ, నాందేడ్‌ ఎంపీగా రవీంద్ర వసంతరావు చవాన్‌ చేత స్పీకర్‌ ఓం బిర్లా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సభా కార్యక్రమాలను మొదలు పెట్టారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

విపక్ష పార్టీల ఎంపీలు సభలో అదానీ అంశాన్ని లేవనెత్తారు. అదానీ సంస్థపై నమోదైన కేసు, ఈ సంస్థపై వచ్చిన ఆరోపణలపై చర్చకు ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సభలో నినాదాలు చేయడంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. దీంతో స్పీకర్‌ సభను 12 గంటల వరకూ వాయిదా వేశారు. మరోవైపు ఎగువ సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అదానీ వ్యవహారంపై చర్చకు కాంగ్రెస్‌ సహా విపక్ష ఇండియా కూటమి ఎంపీలు పట్టుపడటంతో సభను 12 గంటలకు వాయిదా వేశారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్ల‌డం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!

 

ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!

 

గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. లక్షలు! నెలకు ఎంత కట్టాలంటేఅసలు విషయం ఇదే!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

 

పెన్షన్ దారులకు పండగే పండగ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు! కొన్ని కీలక మార్పులు - కచ్చితంగా తెలుసుకోవాల్సిందే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #India #Parliament #LokSabha #RajyaSabha