ఉద్యోగుల ఆరోగ్యం కోసం తక్కువ ప్రీమియంలో బీమా! సర్కార్ సరికొత్త బీమా ప్రణాళిక!

Header Banner

ఉద్యోగుల ఆరోగ్యం కోసం తక్కువ ప్రీమియంలో బీమా! సర్కార్ సరికొత్త బీమా ప్రణాళిక!

  Thu Nov 28, 2024 11:49        Others

ఉద్యోగ ఆరోగ్య బీమా పథకాన్ని (ఈహెచ్ఎస్) జాతీయ బ్యాంకులు, బీమా కంపెనీల ద్వారా అమలు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర వర్గాలకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీరికి ట్రస్టు ద్వారా కాకుండా.. ఎంపికచేసే కంపెనీల ద్వారా బీమా కల్పించే కొత్త ప్రతిపాదన తెరపైకొచ్చింది. ఆరోగ్య బీమా కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ప్రతినెలా చెల్లించే వాటాకు అదనంగా అంతే మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. బీమా సదుపాయం పొందేందుకు ఏడాదికి ఒక్కో ఉద్యోగి, పెన్షనర్ సుమారు రూ.7 వేల వరకు చెల్లిస్తుంటారు. ఇదే సమయంలో జాతీయ బ్యాంకుల్లో కొన్ని తమ వద్ద సేవింగ్ ఖాతాలు గల వారికి ప్రమాద, వైద్య బీమాలు అమలుచేస్తున్నాయి.


ఇంకా చదవండితుపానులా మారుతున్న పవన్ కళ్యాణ్.. నేడు ప్రధాని నరేంద్ర మోదీతో కీలక భేటీ! ఇది ఆరంభం మాత్రమే..



ప్రీమియం తగ్గుదలపై దృష్టి!
ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల చెల్లింపుల ఖాతాలను జాతీయ బ్యాంకుల్లోనే ఉండేలా చూస్తే, బీమా ప్రీమియం తగ్గుతుందా? ప్రయోజనాలు ఎలా ఉంటాయన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటికే రెండు బ్యాంకుల ప్రీమియం రూ.2,500 మాత్రమే ఉన్నట్లు అధికారుల దృష్టికొచ్చింది. కేరళలో ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉంది. ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ అధ్యక్షతన సచివాలయంలో బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ప్రభుత్వ ఉద్దేశాలను బ్యాంకులు, బీమా కంపెనీల వారికి అధికారులు వివరించారు. బీమా కవరేజీ ఏ స్థాయిలో ఉండాలి? ప్రస్తుతం ఏ రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉందన్న దానిపై ఈ సమావేశంలో చర్చించారు. త్వరలో మరోసారి సమావేశం కానున్నారు. తక్కువ ప్రీమియంతో మెరుగైన బీమా సౌకర్యాన్ని కల్పించే బ్యాంకుల్లో వేతనాలు జమ చేయడం ద్వారా వాటిలో నగదు లావాదేవీలు పెరుగుతాయి. దీనికి అనుగుణంగా ఆర్థిక ప్రయోజనాలు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి 8.50 లక్షల మంది ఉన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్, ట్రస్టు ద్వారా ఏడాదికి సుమారు రూ.600 కోట్ల వరకు చికిత్సల నిమిత్తం చెల్లిస్తున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!

 

వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్ల‌డం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!

 

ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!

 

గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. లక్షలు! నెలకు ఎంత కట్టాలంటేఅసలు విషయం ఇదే!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

 

పెన్షన్ దారులకు పండగే పండగ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు! కొన్ని కీలక మార్పులు - కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

 

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే!

 

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులువర్సిటీపై కీలక చర్చలు!

 

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణతమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

 

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #health #insurence #banks #ehs #employees #pension #trust #todaynews #flashnews #latestupdate