వ్యాయామం చేసేటప్పుడు నీరసంగా అనిపిస్తుందా? దీని వెనుక అసలు కారణం?

Header Banner

వ్యాయామం చేసేటప్పుడు నీరసంగా అనిపిస్తుందా? దీని వెనుక అసలు కారణం?

  Wed Dec 04, 2024 15:13        Health

ఫిట్‍నెస్ సాధించేందుకు చాలా మంది వర్కౌట్స్ చేస్తుంటారు. వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరగడంతో పాటు శరీర బరువును కూడా సరిగా మెయింటెన్ చేయొచ్చు. ఫిట్‍నెస్ గోల్స్ సాధించేందుకు చాలా మంది కృషి చేస్తుంటారు. అయితే, కొందరు ఉదయాన్నే వర్కౌట్స్ చేసే సమయంలో నీరసానికి గురవుతారు. దీంతో వ్యాయామాన్ని సరిగా చేయలేకపోతారు. అయితే, వర్కౌట్లు చేసే ముందు కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే శరీరంలో ఎనర్జీ వస్తుంది. అయితే, ఫుడ్స్ తీసుకునేందుకు, వర్కౌట్స్ చేసేందుకు మధ్య అరగంట నుంచి గంట గ్యాప్ ఉండాలి. ఎనర్జీ కోసం వ్యాయామానికి ముందు తినాల్సిన ఆహారాలు ఏవో ఇక్కడ చూడండి. 

 

కోడిగుడ్లు
కోడిగుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. విటమిన్ డీ, ఏ, బీ2, ఐరన్, అయోడిన్, పాస్ఫరస్ లాంటి పోషకాలను గుడ్లు కలిగి ఉంటాయి. అందుకే వర్కౌట్స్ చేసే ముందు కోడిగుడ్లు తీసుకోవడం చాలా మంచిది. ఉడికించిన గుడ్లు తింటే శరీరానికి మంచి ఎనర్జీ వస్తుంది. వ్యాయామం చేసేందుకు బాడీకి మంచి శక్తి వచ్చేందుకు గుడ్లను తీసుకోవచ్చు. ఇవి తింటే వర్కౌట్స్ చేసే సమయంలో నీరసం వచ్చే అవకాశం తగ్గుతుంది. మెరుగ్గా వ్యాయామాలు చేయొచ్చు. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

నట్స్, సీడ్స్
వాల్‍నట్స్, బాదం, జీడిపప్పుల్లో మెగ్నిషియం, మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. కీలకమైన విటమిన్లు, మినరళ్లను కూడా ఇవి కలిగి ఉంటాయి. గుమ్మడి, అవిసె, చియా లాంటి సీడ్లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్ సహా ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అందుకే వర్కౌట్స్ చేసే ముందు నట్స్, సీడ్స్ తింటే శరీరంలో శక్తి బాగా పెరుగుతుంది. సీడ్స్‌ను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే మరింత మేలు. దీనివల్ల అవి జీర్ణం కూడా సులువుగా అవుతుంది. 

 

అరటి పండు
అరటి పండ్లలో పొటాషియం, సింపుల్ కార్బొహైడ్రేట్స్, ఎలక్ట్రోలైట్ ఉంటాయి. ఇవి శరీరంలో ఎనర్జీని బాగా పెంచుతాయి. అరటిలో మరిన్ని విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. వర్కౌట్‍కను ముందు తినేందుకు అరటి పండు కూడా ఓ బెస్ట్ ఆప్షన్‍గా ఉంది. 

 

ఇంకా చదవండిమందుబాబులకు బిగ్ షాక్.. రాష్ట్రంలో వైన్స్ బంద్! ఎప్పటి నుంచంటే..? ఎందుకంటే? 

 

ఓట్‍మీల్
వ్యాయామానికి ముందు ఓట్‍మీల్ తినడం కూడా మేలు. ఇవి కూడా బాడీకి శక్తిని ఇస్తాయి. ఓట్‍మీల్‍లో ప్రోటీన్స్, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, ఫైబర్, కాంప్లెక్స్ కార్బ్స్ మెండుగా ఉంటాయి. ఇవి ఎనర్జీ స్థాయిలను మెరుగ్గా ఉంచుతాయి. వర్కౌట్స్ చురుగ్గా చేసేందుకు ఓట్‍‍మీల్ తోడ్పడతాయి. 

 

అవకాడో
శరీరానికి అవకాడో మంచి ఎనర్జీ ఇస్తుంది. ఇందులోని పొటాషియం, అన్‍సాచురెటెడ్ ఫ్యాట్స్, విటమిన్ బీ, విటమిన్ కే, ఫైబర్ శక్తిని మెరుగ్గా అందిస్తాయి. ఇది తింటే చాలాసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి. వర్కౌట్లను మెరుగ్గా చేసేందుకు అవకాడో తినడం ఉపకరిస్తుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ జిల్లాలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్! ఇలా అప్లై చేసుకుంటే - నేరుగా అకౌంట్లోకి రూ. 2.50 లక్షలు జమ!

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... ఐటీ గ్లోబల్ పాలసీకు ఆమోదం! ఆంధ్రా పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప అవకాశం!

 

అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!

 

చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!

 

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రిమాజీ ఎమ్మెల్యే కూడా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Health #Exercise #WorkOut