2025 హెచ్-1బీ వీసా తాజా అప్‌డేట్ ఇదే! USCIS నుంచి కీలక ప్రకటన!

Header Banner

2025 హెచ్-1బీ వీసా తాజా అప్‌డేట్ ఇదే! USCIS నుంచి కీలక ప్రకటన!

  Wed Dec 04, 2024 18:01        U S A

భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే హెచ్-1బీ వీసాలకు సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది. 2025 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వీసాల కోసం తగినన్ని పిటిషన్లు వచ్చినట్లు అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సేవల (USCIS) విభాగం వెల్లడించింది. హెచ్-1బీకి ఎంపిక కాని వారికి మరికొన్ని రోజుల్లో ఆన్లైన్లో సమాచారం అందిస్తామని తెలిపింది. వీటిని పంపడం పూర్తైన తర్వాత.. ఎంపిక కాని వారికి స్టేటస్ మెసేజ్ను ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. హెచ్-1బీ వీసా పిటిషన్ దాఖలు ప్రక్రియ జూన్ 30, 2024తోనే ముగిసింది. అయితే, 30వ తేదీ ఆదివారం కావడంతో జులై 1న దాఖలైన పిటిషన్లను కూడా గడువులోగా దరఖాస్తు చేసినట్లుగానే పరిగణిస్తామని యూఎస్ సీఐఎస్ పేర్కొంది. అయితే, వీసా పరిమితి నుంచి మినహాయింపు కలిగిన పిటిషన్ల స్వీకరణ, పరిశీలన కొనసాగుతుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా హెచ్-1బీ వీసాతో అమెరికాలో పనిచేస్తున్న నిపుణులు ఉద్యోగ నిబంధనలు, సంస్థ మార్పు వంటి తదితర కారణాలతో దాఖలు చేసే పిటిషన్ల స్వీకరణ కొనసాగుతుందని పేర్కొంది.



ఇంకా చదవండిబెండ‌కాయ‌ల‌ను త‌ర‌చూ తింటే ఇన్ని లాభాలా? తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు!



వివిధ దేశాలకు చెందిన వృత్తి నిపుణుల సేవలు వినియోగించుకోవాలని భావించే అమెరికా సంస్థలు వీసాలను స్పాన్సర్ చేస్తుంటాయి. ఇందుకోసం ప్రతి ఏడాది 85 వేల హెచ్-1బీ వీసాలను అమెరికా జారీ చేస్తుంది. ఇందులో 65వేల వీసాలు రెగ్యులర్ క్యాప్ కింద కాగా.. మరో 20 వేల వీసాలను తమ దేశంలో అడ్వాన్స్ డిగ్రీలు చేసిన వారికి మాత్రమే ఇస్తుంది. అయితే, గూగుల్, ఇన్ఫోసిస్, అమెజాన్, ఐబీఎం వంటి సంస్థలు దిగ్గజ అమెరికన్ సంస్థలు ఈ వీసాల సంఖ్యను ఇటీవల తగ్గించుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... ఐటీ గ్లోబల్ పాలసీకు ఆమోదం! ఆంధ్రా పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప అవకాశం!

 

అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!

 

చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!

 

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రిమాజీ ఎమ్మెల్యే కూడా!

 

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారాఅయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #Indians #H1Bvisa #USA #newupdate #todaynews #flashnews #latestupdate