అర్ధరాత్రి మీటింగ్... జెప్టోలో పని పరిస్థితులపై పోస్టు వైరల్! స్పందించిన సీఈఓ !
Wed Dec 04, 2024 18:58 Othersప్రముఖ క్విక్ కామర్స్ జెప్టోలో (Zepto) పని పరిస్థితులపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఓ పోస్ట్ చర్చనీయాంశమైంది. అర్ధరాత్రులు మీటింగ్‌లు పెడతారని, వారానికి సగటున 10 మంది అక్కడ ఉద్యోగం వీడుతుంటారనేది ఆ పోస్ట్ సారాంశం. ఈ పోస్ట్ వైరల్‌గా మారడంతో జెప్టో సీఈఓ ఆదిత్ పలిచా ఎక్స్ వేదికగా స్పందించారు. తాము వర్క్, లైఫ్ బ్యాలెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామంటూ పేర్కొన్నారు. జెప్టోలో దారుణమైన పని పరిస్థితులు అంటూ రెడిట్ యూజర్ ఒకరు సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చారు. జెప్టోలో తాను ఏడాది పాటు పనిచేశానని అందులో పేర్కొన్నాడు. అక్కడి పని విధానంతో పాటు వ్యాపార విధానాలనూ తన పోస్ట్‌లో ప్రస్తావించాడు. కంపెనీ సీఈఓ ఆదిత్ పలిచా ఉదయం ఆలస్యంగా లేస్తాడని, అందుకే మధ్యాహ్నం 2 గంటల తర్వాతే పని ప్రారంభిస్తాడని ఆ వ్యక్తి ఆరోపించాడు. అర్ధరాత్రులు 2 గంటలకు మీటింగ్‌లు పెడుతుంటాడని, ఏ మీటింగ్ కూడా సకాలంలో జరగవని, కొన్నిసార్లు వాయిదా కూడా పడుతుంటాయని పేర్కొన్నాడు. జెప్టోలో యువకుల్నే ఉద్యోగాల్లో చేర్చుకుంటూ ఉంటారని తెలిపాడు. పెద్దవాళ్లు అలాంటి ప్రదేశాల్లో పని చేయలేరని పేర్కొన్నాడు. జెప్టోలో రోజుకు 14 గంటలు పని చేయించుకుంటారని ఆరోపించాడు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!
రూ.30వేలు పైబడి ధర కలిగిన స్మార్ట్ఫోన్లు వాడుతున్నవారికి అధికంగా ఛార్జ్ చేస్తుంటారని, ఈవిషయంలో కంపెనీపై అనేక ఫిర్యాదులు కూడా ఉన్నాయని పేర్కొన్నాడు. అవేవీ బయటకు రాకుండా కంపెనీ మసిపూసి మారేడుకాయ చేస్తుంటుందని తెలిపాడు. ఇంత దారుణమైన పరిస్థితుల్లోనూ కొందరు అక్కడే కొనసాగడానికీ ఓ కారణం ఉందన్నాడు. త్వరలో ఐపీఓకు వస్తే సొమ్ము చేసుకోవచ్చన్నది వారి ఆలోచనగా పేర్కొన్నాడు. ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో ఆదిత్ పలిచా ఎక్స్ వేదికగా బుధవారం స్పందించాడు. వైరల్ పోస్ట్‌ను ప్రస్తావించకుండా.. తాను వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు వ్యతిరేకం కానని, తన పోటీదారులకు కూడా తాను ఈ విషయాన్ని సూచిస్తుంటానని చెప్పాడు. భారత సంతతికి చెందిన ఓ స్టార్టప్ సీఈఓ దక్ష్ గుప్తా ఇచ్చిన ఇంటర్వ్యూలోని అంశాన్ని తాను ఇక్కడ ప్రస్తావించినట్లు పేర్కొన్నాడు. పలిచా పోస్ట్‌పె కొందరు పాజిటివ్‌గా స్పందించగా.. మరికొందరు పని పరిస్థితులు మెరుగుపరచాలని సూచించారు. ఈ ట్వీట్ కోసమే ఉదయం లేచినట్లు ఉన్నాడంటూ మరికొందరు ఫన్నీగా కామెంట్లు పెట్టారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!
చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!
టీడీపీలోకి వైసీపీ కీలక నేత..? చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా!
ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #zepto #employees #complaints #ceo #postviral #todaynews #flashnews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.