జగన్... వైకాపా నాయకులే భూ సమస్యలు పెంచారు! రెవెన్యూ సదస్సులు ప్రారంభం!

Header Banner

జగన్... వైకాపా నాయకులే భూ సమస్యలు పెంచారు! రెవెన్యూ సదస్సులు ప్రారంభం!

  Wed Dec 04, 2024 17:23        Politics

గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satyaprasad) తెలిపారు. మంగళగిరిలోని సీసీఎల్ఎ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 6 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. అన్ని రకాల భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు. భూ వివాదాలకు ముగింపు పలికే విధంగా సదస్సులు నిర్వహించాలని తెలిపారు. ఈ సదస్సుల్లో భూ దురాక్రమణలు, 22ఏ భూముల ఉల్లంఘనపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి, పేదలకు సమస్యలు లేని పాలన అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి వెల్లడించారు.


ఇంకా చదవండిబెండ‌కాయ‌ల‌ను త‌ర‌చూ తింటే ఇన్ని లాభాలా? తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు!



క్షేత్రస్థాయిలో వైకాపా(ysrcp) అధినేత జగన్ (ysjagan), ఆ పార్టీ నాయకులే భూ సమస్యలు పెంచారని మంత్రి అనగాని ఆరోపించారు. ల్యాండ్, ఇసుక, లిక్కర్ మాఫీయాల ద్వారా గత ప్రభుత్వం నిధులు దోచుకుందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు(chandrababu) ప్రతినెలా రివ్యూ పెట్టి సమస్యలు పరిష్కరిస్తున్నారన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. విజయవాడ వరదల కారణంగా సదస్సులు వాయిదా పడ్డాయన్నారు. ఈనెల 6 నుంచి వచ్చేనెల 8 వరకు 17,564 గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. నూతన రేషన్ కార్డులపైనా సదస్సుల్లో చర్చిస్తామన్నారు. గ్రామాల్లో లీజ్కు ఇచ్చిన భూముల స్టేటస్ ఎలావుందో చూస్తామని తెలిపారు. మదనపల్లి వ్యవహారంపై సీఐడీ విచారణకు సీఎం ఇప్పటికే ఆదేశించారని మంత్రి వెల్లడించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... ఐటీ గ్లోబల్ పాలసీకు ఆమోదం! ఆంధ్రా పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప అవకాశం!

 

అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!

 

చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!

 

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రిమాజీ ఎమ్మెల్యే కూడా!

 

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారాఅయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #land #mafiya #jagan #fruad #revenue #todaynews #flashnews #latestupdate