ఆకాశ ఎయిర్‌కు డీజీసీఏ షాక్! రూ.10 లక్షల ఫైన్! ఎందుకంటే?

Header Banner

ఆకాశ ఎయిర్‌కు డీజీసీఏ షాక్! రూ.10 లక్షల ఫైన్! ఎందుకంటే?

  Tue Dec 24, 2024 20:24        India

ప్రముఖ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ‘ఆకాశ ఎయిర్’కు విమానయాన నియంత్రణ సంస్థ ‘డీజీసీఏ’ షాక్ ఇచ్చింది. గత సెప్టెంబర్‌లో బెంగళూరు విమానాశ్రయంలో కొందరు ప్రయాణికుల బోర్డింగ్‌కు పరిహారం ఇవ్వడంలో విఫలమైంది ఆకాశ ఎయిర్. అందుకు ఆకాశ ఎయిర్ యాజమాన్యానికి డీజీసీఏ రూ.10 లక్షల జరిమాన విధించింది. కొన్ని నిబంధనలను ఉల్లంఘిస్తుందన్న ఆరోపణలపై ఆకాశ ఎయిర్ మీద డీజీసీఏ నిఘా పెట్టింది. పైలట్ల శిక్షణలో నిబంధనలు పాటించడం లేదని డీజీసీఏ ఆందోళన వ్యక్తం చేసింది. కానీ, తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారం అని ఆకాశ ఎయిర్ తెలిపింది. 

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

గత సెప్టెంబర్ ఆరో తేదీన బెంగళూర్ నుంచి పుణె వెళ్లేందుకు ఏడుగురు ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే అదే రోజు విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమాన సర్వీసు మార్చారు. దరిమిలా ఏడుగురు ప్రయాణికులకు బోర్డింగ్ నిరాకరించింది ఆకాశ ఎయిర్. దీంతో సదరు ప్రయాణికులు ఇండిగో విమానంలో షెడ్యూల్డ్ టైం కంటే గంటన్నరకు పైగా ఆలస్యంగా అంటే రాత్రి 10.40 గంటలకు పుణెకు చేరుకున్నారు.

 

ఇంకా చదవండినిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం రూ.50 వేలు!Don'tMiss 

 

ఈ విషయమై డీజీసీఏ ప్రమాణాలకు అనుగుణంగా సదరు ప్రయాణికులకు పరిహారం చెల్లించలేదని సమాచారం. దీనిపై డీజీసీఏ నోటీసుకు స్పందించిన ఆకాశ ఎయిర్.. సదరు ప్రయాణికులకు బోర్డింగ్ నిరాకరించడాన్ని సమర్థించుకున్నది. సంబంధిత ప్రయాణికులకు పరిహారం చెల్లించాలని ఈ నెల 23న ఆకాశ ఎయిర్ యాజమాన్యాన్ని డీజీసీఏ ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రయాణికులకు పరిహారం చెల్లించనందుకు ఆకాశ ఎయిర్ మీద రూ.10 లక్షల ఫైన్ విధిస్తూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

 

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!

 

డబ్బులు కడితే దొంగ దొర అవుతాడా? పదేపదే నీతులు వల్లించే వైసీపీ నేత! మాజీ మంత్రి పై మంత్రి ఫైర్!

 

2025 జనవరితో ఆ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు బంద్! బ్యాకప్ లేకుంటే మీ డాటా పోయినట్టే!

 

USAలో మ‌రో తెలుగు విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి! ఎవరు? ఎందుకు? దీని వెనుక ఎవరి హస్తం!

 

నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #India #Travel #AirTravel #AkasaAir #Christmas #NewYear