మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారా? అయితే ఇలా చెయ్యండి!

Header Banner

మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారా? అయితే ఇలా చెయ్యండి!

  Thu Dec 26, 2024 19:04        Life Style

సమాజంలో ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య మానసిక ఒత్తిడి. చిన్నారులలో చదువుల కారణంగా కలుగుతున్న మానసిక ఒత్తిడి, ఇక పెద్దలలో చేస్తున్న పని లేదా ఉద్యోగం కారణంగా వస్తున్న మానసిక ఒత్తిడి ఇప్పుడు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాయి. ఎంత డబ్బు సంపాదించినా మనశ్శాంతిగా నిద్రపోతున్న పరిస్థితులు లేవు. ఇలా మానసిక ఒత్తిడితో బాధపడేవారు మనసు ప్రశాంతంగా ఉండటం కోసం కొన్ని టిప్స్ ను పాటించాలి. 

 

మానసిక ఒత్తిడి తగ్గించుకోవటానికి ఇలా చెయ్యండి మానసిక ఆరోగ్యం కోసం ఒత్తిడిని తగ్గించే మందులు వేసుకోవడం కంటే ఒత్తిడిని నేచురల్ గా తగ్గించుకోవడమే మంచిది. అందులో మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కొన్ని డైట్ లు బాగా పనికొస్తాయని నిపుణులు చెబుతున్నారు. సమతుల్య ఆహారాన్ని తీసుకుంటే మనసుకి ఆరోగ్యతోపాటు ఒత్తిడి కూడా నియంత్రించుకోవచ్చునని అనేక పరిశోధనలు సైతం వెల్లడించాయని చెబుతున్నారు.

 

మానసిక ఒత్తిడి తగ్గాలంటే యోగా, ధ్యానం
ఆరోగ్యకరమైన డైట్ మనుషుల మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని, ఇది వారి ఉత్సాహం పైన ఎటువంటి ప్రభావాన్ని చెడు చూపించదని నిర్దిష్టమైన డైట్ తీసుకునే వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతి రోజు కనీసం ఒక అరగంట అయినా యోగా, ధ్యానం వంటివి చేస్తే మంచిదని సూచిస్తున్నారు.

 

ఇంకా చదవండితిరుమల భక్తులకు శుభవార్త! గంటలోనే శ్రీవారి దర్శనం - అమల్లోకి టీటీడీ కొత్త విధానం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

వ్యాయామంతోనూ మానసిక ఒత్తిడికి చెక్
యోగా, ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. అంతేకాదు ప్రతిరోజు వ్యాయామం చేయడం కూడా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇక మానసిక ఒత్తిడి తగ్గాలంటే అప్పుడప్పుడు పని నుండి బ్రేక్ తీసుకుని ఇష్టమైన పనులు చెయ్యాలని, మనసుకు నచ్చిన సంగీతం వినటం, స్నేహితులను కలవటం చెయ్యాలని అన్నారు.

 

క్రమబద్దమైన జీవన శైలితో మానసిక ఒత్తిడికి పరిష్కారం
ఒక క్రమబద్ధమైన జీవనశైలిని అలవర్చుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోతే కూడా మానసిక ఒత్తిడి తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనుక మానసిక ఒత్తిడిని జయించటం కోసం వీటిలో ఏదో ఒకటి ప్రతీరోజూ అలవాటు చేసుకోండి. లేదంటే మానసిక ఒత్తిడి మనలను తీవ్రమైన డిప్రెషన్ లోకి నెట్టి మానసిక వ్యాధి గ్రస్తులుగా మారుస్తుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పీఆర్, పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..

 

ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!

 

ఏపీకి తీపికబురు చెప్పిన కేంద్రం.. పవన్ శాఖకు బిగ్ బూస్ట్! ఇక వారికి పండగే పండగ - రెండు విడతలుగా నిధులు విడుదల!

 

అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!

 

నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

ఏపీఎస్డీఎంఏ: రెండ్రోజుల పాటు వర్షాలు! బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో..

 

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో మలుపు! ఏ18గా మైత్రీ మూవీస్... నిందితుల జాబితా ఇదే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #LifeStyle #Stress #Depression #Foods #Diet