12 మంది భార్యలు, 102 మంది పిల్లలు.. ఇక చాలట! ఏమిరా బాలరాజు ఏమిరా దేశానికి ఉపయోగం నీవల్ల!

Header Banner

12 మంది భార్యలు, 102 మంది పిల్లలు.. ఇక చాలట! ఏమిరా బాలరాజు ఏమిరా దేశానికి ఉపయోగం నీవల్ల!

  Thu Dec 26, 2024 18:59        World

ప్రస్తుత రోజుల్లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంటే.. ఆ వ్యక్తి మాత్రం ఏకంగా 12 మందిని పెళ్లి చేసుకుని 102 మంది పిల్లలను కనేశాడు. ఇంకా పెళ్లిళ్లు చేసుకుని.. మరికొంతమంది పిల్లలను కనాలనే ఆశ అతడిలో ఇంకా సజీవంగానే ఉంది! కానీ, పరిస్థితులు అతడిని ఓ కఠిన నిర్ణయం తీసుకొనేలా చేశాయి. దీంతో అతడు పెళ్లి, పిల్లలు అనే ఆలోచనను అటకెక్కించాడు. ప్రస్తుతం ఉన్నవారిని పోషించలేక ఇబ్బందుల్లో పడ్డాడు. అది సరే, అంతమందిని కనేసిన ఆ పెద్దమనిషి ఎవరు అనేగా మీ సందేహం. ఆయన్ను మీరు చూడాలంటే ఉగాండా వెళ్లాలి. బుటలజా జిల్లాలోని బుగిసా అనే గ్రామంలో నివసిస్తున్న అతడి పేరు ముసా హసహ్య. అయితే, మీరు ఆ ఊరిలోకి వెళ్లి ఇతడి పేరు చెబితే చాలు.. నేరుగా ఇంటికి తీసుకెళ్లిపోతారు. ఎందుకంటే.. ఆ గ్రామంలో మనోడు అంత ఫేమస్ మరి! ఒక వేళ అతడి పేరు మీరు మరిచిపోయినా.. 12 మందిని పెళ్లి చేసుకున్న వ్యక్తి అని చెప్పినా చాలట.12 మందిని పెళ్లి చేసుకున్న ముసా హసహ్యకు రెండు ఎకరాల భూమి మాత్రమే ఉంది. అందులో పంటలు పండిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీంతో అందరికీ ఆహారం, దుస్తులు వంటివి సమాకూర్చలేకపోతున్నాడు. అందుకే ఇటీవలే ఇద్దరు భార్యలు అతడిని విడిపెట్టి వెళ్లిపోయారు. మరో ముగ్గురు భార్యలు పక్క ఊర్లో ఉంటున్నారు. "మా తల్లిదండ్రులకు ఇద్దరే పిల్లలు. కాబట్టి మా కుటుంబ వారసత్వాన్ని విస్తరించేందుకు అంతమంది భార్యలను పెళ్లి చేసుకున్నాను. 102 మంది పిల్లలకు తండ్రి అయ్యాను. వంశాన్ని విస్తరించాలంటే అనేక మంది మహిళలను పెళ్లి చేసుకోవాలని మా సోదరుడు, బంధువులు, స్నేహితులు నాకు సలహా ఇచ్చారు.

 

ఇంకా చదవండి: ఇలాంటి తండ్రి కూడా ఉంటాడా! ఛీ.. ఛీ.. అప్పు కోసం కూతుర్ని ఏం చేశాడో తెలిస్తే షాక్!

 

అందుకే నా మొదటి భార్యను 1972లో సంప్రదాయ రీతిలో పెళ్లి చేసుకున్నాను. అప్పటికి నా వయసు 17 ఏళ్లు. పెళ్లైన సంవత్సరానికి మొదటి బిడ్డ సాండ్రా నాబ్వైర్​ జన్మించింది. ప్రస్తుతం నా భార్యలు గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారు" అని హసహ్య చెప్పాడు. హసహ్య 102 మంది పిల్లల వయసు 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందట. అతడి చిన్న భార్య వయసు 35 ఏళ్లట. అయితే పెద్ద సవాలు ఏమిటంటే హసహ్యకు తన చాలా మంది పిల్లల పేర్లు గుర్తులేవట. పిల్లలను గుర్తించడంలో వారి తల్లుల సహాయం తీసుకుంటాడట. అంతే కాకుండా హసహ్య తన కుటుంబంలో తలెత్తే వివాదాలను పరిష్కరించుకోవడానికి నెలకోసారి కుటుంబ సమావేశాలను కూడా నిర్వహిస్తున్నాడట. హసహ్య కుటుంబానికి చెందిన చాలా మంది సభ్యులు తమ పొరుగువారి ఇళ్లలో పనులు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే కాలినడకనే ప్రయాణిస్తున్నారు. అంతే కాకుండా రోజూ వరుస క్రమంలో కూర్చుని భోజనం చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఆహారం సరిపోదని, ఆ సమయంలో రోజుకు రెండు సార్లే తింటామని హసహ్య మూడో భార్య జబీనా చెప్పింది. ఏదేమైనా తన కుటుంబమంతా తనను ప్రేమిస్తున్నట్లు హసహ్య చెబుతున్నాడు.

 Africa.jpg

ఇంకా చదవండి: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు (26/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఇండియాలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏదో తెలుసా..? రైల్వేకు అతి పెద్ద సవాల్ గా.. ఒక్కొక్క బోగీ తయారీకి ఎన్ని కోట్లు అంటే!

 

ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.. వాటిపై 90 శాతం రాయితీ! వెంటనే పొందండి..

 

తిరుమల భక్తులకు శుభవార్త! గంటలోనే శ్రీవారి దర్శనం - అమల్లోకి టీటీడీ కొత్త విధానం!

 

పీఆర్, పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..

 

ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!

 

ఏపీకి తీపికబురు చెప్పిన కేంద్రం.. పవన్ శాఖకు బిగ్ బూస్ట్! ఇక వారికి పండగే పండగ - రెండు విడతలుగా నిధులు విడుదల!

 

అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!

 

నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #ViralVideo #Uganda #MusaHasahyaKasera