మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

Header Banner

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

  Sat Dec 28, 2024 07:00        Politics

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బీసీలకు స్వయం ఉపాధి అవకాశాలను అందించేందుకు ముందడుగు వేస్తోంది. బీసీ సంక్షేమ శాఖ రూపొందించిన పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించారు. ఆయన అనుమతి రాగానే ఈ పథకాలను అమలు చేస్తారు. ఈ కార్యక్రమాల ద్వారా బీసీ, ఈబీసీ మహిళలతో పాటు యువతకు ఆర్థిక స్వావలంబనను కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలను తీసుకొచ్చారు. బీసీ, ఈబీసీ మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ అందించడానికి బీసీ సంక్షేమ శాఖ ప్రణాళిక రూపొందించింది. దాదాపు 80,000 మంది మహిళలకు ఈ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ శిక్షణ కోసం 90 రోజుల పాటు రోజుకు నాలుగు గంటల పాటు శిక్షణా తరగతులను నిర్వహిస్తారు. శిక్షణ పూర్తి చేసిన వారందరికీ రూ. 24,000 విలువ చేసే కుట్టు మిషన్లను ఉచితంగా అందజేస్తారు. శిక్షణా కార్యక్రమం నిర్వహణ కోసం నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఒప్పందం కుదుర్చారు. జనరిక్ మందుల షాపుల ద్వారా యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో డిమాండ్ ఉన్న చోట షాపులను ప్రారంభించనున్నారు. డీ ఫార్మా, బీ ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ షాపుల ఏర్పాటుకు రూ. 8 లక్షలు ఆర్థిక సాయం అందిస్తారు. ఇందులో రూ. 4 లక్షలు సబ్సిడీగా, మిగిలిన రూ. 4 లక్షలు రుణ రూపంలో అందిస్తారు. ఈ పథకంతో బీసీ యువత ఉపాధి సాధనకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది.

 

ఇంకా చదవండి: అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

మంత్రివర్యులు సవిత ఇటీవల యువతకు ఉపాధి శిక్షణపై ప్రత్యేక వ్యాఖ్యలు చేశారు. జనవరి నుంచి 10,000 మంది యువతకు వివిధ రంగాల్లో శిక్షణ అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మెడికల్ స్టోర్స్, ఫుడ్ ప్రాసెసింగ్, సీఫారమ్స్, పౌల్ట్రీ యూనిట్లలో శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రంగాల నుంచి ఉత్పత్తి అయ్యే వస్తువులను ప్రభుత్వం మార్కెటింగ్ చేస్తూ, యువతకు స్థిర ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రులు చెప్పారు. ఈ కార్యక్రమాలు బీసీ సంక్షేమానికి కొత్త దారి చూపుతాయని ప్రభుత్వ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పథకాలు అమలవడంతో బీసీ, ఈబీసీ వర్గాల మహిళలు, యువత ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఈ పథకాల ప్రభావం సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

 

7 సీటర్ కార్ కొనాలి అనుకునే వారికి గుడ్ న్యూస్! అతి తక్కువ ధరతో.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!

 

ఏపీలో పెన్షనర్లకు శుభవార్త! న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

ఇండియాలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏదో తెలుసా..? రైల్వేకు అతి పెద్ద సవాల్ గా.. ఒక్కొక్క బోగీ తయారీకి ఎన్ని కోట్లు అంటే!

 

జగన్ ఇంటి ముందు ధర్నా చేయాలి.. ప్రపంచంలో ఇంత వింత ఎక్కడా! మంత్రి మండిపాటు!

 

రేవంత్ రెడ్డికి కీలక ప్రతిపాదనలు చేసిన సినీ ప్రముఖులు! ప్రస్తుత ప్రభుత్వంపై.. అవేంటంటే!

 

నేడు (26/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఇండియాలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏదో తెలుసా..? రైల్వేకు అతి పెద్ద సవాల్ గా.. ఒక్కొక్క బోగీ తయారీకి ఎన్ని కోట్లు అంటే!

 

ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.. వాటిపై 90 శాతం రాయితీ! వెంటనే పొందండి..

 

తిరుమల భక్తులకు శుభవార్త! గంటలోనే శ్రీవారి దర్శనం - అమల్లోకి టీటీడీ కొత్త విధానం!

 

పీఆర్, పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..

 

ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!

 

ఏపీకి తీపికబురు చెప్పిన కేంద్రం.. పవన్ శాఖకు బిగ్ బూస్ట్! ఇక వారికి పండగే పండగ - రెండు విడతలుగా నిధులు విడుదల!

 

అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!

 

నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews