ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

Header Banner

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

  Sat Dec 28, 2024 08:07        Politics

గ్రామీణ ప్రాంత ప్రజల అతి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగకే విద్యార్ధులకు ఎక్కువ రోజులు సెలవులు వస్తాయి. ఉద్యోగ, వ్యాపార, ఇతరత్రా పనుల వల్ల ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సంక్రాంతి పండుగ సెలవులకు స్వగ్రామాలకు చేరుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో ఆనందోత్సాహాలతో గడుపుతూ ఉంటారు. అందుకే సంక్రాంతి సెలవులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతి సెలవులపై సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు.

 

ఇంకా చదవండి: నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

2024 - 25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు ఇప్పటికే స్థానిక అధికారులు సెలవులు ప్రకటించినందున ఈ సారి 11వ తేదీ నుంచి 15 వరకు, లేదా 12 నుంచి 16వ తేదీ వరకూ మాత్రమే సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు. ఇప్పటికే 2025 సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. షెడ్యూల్ మొత్తం 23 సాధారణ సెలవులు, 21 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయని ఆ జాబితాలో పేర్కొంది.  

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews