సీన్ రివర్స్… ఆ షాపుల వద్దకు మందుబాబులు రావడం లేదట! ఎందుకో తెలుసా…?

Header Banner

సీన్ రివర్స్… ఆ షాపుల వద్దకు మందుబాబులు రావడం లేదట! ఎందుకో తెలుసా…?

  Sun Dec 29, 2024 17:34        Others

తెలంగాణ - ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లోని మద్యం దుకాణాలకు ఒకప్పుడు భారీ డిమాండ్ ఉండేది. ఉమ్మడి నల్లగొండ ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో సరిహద్దు ప్రాంతాల్లోని మద్యం దుకాణాల కోసం ఎంతైనా వెచ్చించేవారు. ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు మద్యం ప్రియులు నాణ్యమైన మద్యం కోసం మందుబాబులు నానా ఇబ్బందులు పడ్డారు. అక్కడ బ్రాండెడ్ మద్యం అందుబాటులో లేకపోవడంతో తెలంగాణ వైపు వచ్చేవారు. దీంతో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దు మండలాల్లోని మద్యం దుకాణాల్లో విక్రయాలు ఎక్కువగా జరిగేవి.



ఇంకా చదవండి
నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!


తెలంగాణ సరిహద్దు వైన్స్ షాపుల్లో మందుబాబుల రద్దీని తట్టుకునేందుకు రేషన్ కార్డు నిబంధనతోపాటు ఆదివారం సెలవు దినాల్లో అయితే పోలీస్ పహారా మధ్య మద్యం విక్రయాలు జరిగేవి. గతంలో రాష్ట్రంలో ఎక్కువ మద్యం విక్రయాలు జీహెచ్ఎంసీ పరిధిలో జరిగేవి. అంతకంటే ఎక్కువగా సరిహద్దు దుకాణాల్లో ఎక్కువగా మద్యం విక్రయాలు కొనసాగాయి. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏపీలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడిన తర్వాత కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చింది. దీంతో ఏపీలో అన్ని రకాల మద్యం బ్రాండ్లను మందుబాబులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీంతో ఏపీ మందు బాబులు తెలంగాణ మద్యం షాపుల వైపు కన్నెత్తి చూడడం లేదు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



తెలంగాణ సరిహద్దుల్లోని మద్యం దుకాణాలన్నీ వెలవెలబోతున్నాయి. ఫలితంగా సరిహద్దుల్లోని ఆరు జిల్లాల మద్యం షాపుల్లో విక్రయాలు పడిపోయాయి. సరిహద్దుల్లోని మద్యం షాపులు ఇప్పుడు మందు బాబుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఆయా దుకాణాల్లో విక్రయాలు పెంచుకునేందుకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ చెమటోడ్చాల్సి వస్తోంది. మూడు ఉమ్మడి సరిహద్దు జిల్లాల్లోని మద్యం దుకాణాల్లో మందుబాబులు రాకపోవడంతో డిసెంబర్ నెలలో 40 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. దసరా, నూతన సంవత్సరం వేడుకల సమయంలోనే ఆబ్కారీ శాఖకు ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈసారి సరిహద్దుల్లో కొత్త సంవత్సర ఆదాయం కూడా గణనీయంగా తగ్గనుందని భావిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి సరిహద్దు జిల్లాల్లో రూ.300 కోట్ల ఆదాయం తగ్గే అవకాశాలున్నాయని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త పథకం! వారికి పెట్రోల్, డీజీల్‌పై 50% రాయితీ.. వెంటనే అప్లై చేసుకోండి?

 

చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!

 

నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటేకొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

 

నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #telngana #andhrapradesh #wines #shops #todaynews #flashnews #latestupdate