మేం మోదీగారి తాలూకా! మీకెలాంటి పనైనా చేసిపెడతాం! ప్రజల నుంచి కోట్లు కొల్లగొట్టిన జంట!

Header Banner

మేం మోదీగారి తాలూకా! మీకెలాంటి పనైనా చేసిపెడతాం! ప్రజల నుంచి కోట్లు కొల్లగొట్టిన జంట!

  Wed Jan 01, 2025 13:10        India

రాజకీయ నాయకులు, సినిమా హీరోలు తమకు తెలుసంటూ.. డబ్బులిస్తే వారిని కలిసే ఏర్పాటు చేస్తామని చెబుతూ అమాయక ప్రజలను మోసం చేస్తుంటారు అనేక మంది కిలాడీలు. స్థానికంగా ఉండే నాయకుల పేరు చెప్పటం గురించి మనకు తెలుసు కానీ.. ఎకంగా ప్రధాని మోదీ తాలూకా అంటూ బిల్డప్ ఇచ్చిందో జంట. తాము మోదీ ప్రధాన కార్యదర్శి మిశ్రా కూతురు, అల్లుడినంటూ మాయ మాటలు చెప్పి అనేక మందిని బురిడీ కొట్టించారు. కోట్లలో మోసం చేసి చివరకు అరెస్ట్ అయ్యారు. అసలీ కథేంటో మనం ఇప్పుడు చూద్దాం.

 

హీరోలు, రాజకీయ నాయకులు తెలుసంటూ, వారిని కలిపిస్తామని చెబుతూ అనేక మంది అమాయక ప్రజల నుంచి డబ్బులు గుంజడం మనం చాలా సినిమాల్లోనే చూశాం. కానీ నిజ జీవితంలోనూ అలాంటి మోసాలకే పాల్పడిందో జంట. ముఖ్యంగా ప్రధాని మోదీ కార్యదర్శి కుటుంబ సభ్యులుగా నటిస్తూ.. అనేక మందికి మాయ మాటలు చెప్పారు. అవి నిజమని నమ్మిన వాళ్లు వారి దగ్గరకు రాగా.. టెండర్లు ఇప్పిస్తామంటూ కోట్లు తీసుకున్నారు. ఇలా ఒకరిద్దరి వద్ద నుంచి కాదు అనేక మంది దగ్గర నుంచి కోట్ల రూపాయలు లాక్కున్నారు. చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నారు. 

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

భువనేశ్వర్‌కు చెందిన 38 ఏళ్ల హన్సితా అభిలిప్సా, అనిల్ మొహంతిలు భార్యాభర్తలు. అయితే వీరిద్దరూ భువనేశ్వర్‌లోని ఇన్ఫోసిటీ ప్రాంతంలో ఓ విలాసవంతమైన భవనం అద్దెకు తీసుకుని కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అభిలిప్సా తాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా కూతురునని అందరితో చెప్పుకుంటుంది. ఆ విషయాలను అందరూ నమ్మేలా... అనేక మంది రాజకీయ ప్రముఖులతో కలిసి దిగినట్లుగా ఉన్న ఫొటోలను కార్యాలయంలో పెట్టుకునేది. అంతేకాకుండా వచ్చిన వారందరికీ ఆ ఫొటోలను చూపించేది. అలాగే ఆమె భర్త కూడా తాను మిశ్రా అల్లుడినంటూ మాయ మాటలు చెప్పేవాడు. 

 

అయితే ఈ జంట మాటలు నమ్మిన వారు తమ కార్యాలయానికి వస్తే.. టెండర్లు ఇప్పిస్తామం, మీకెలాంటి పనులు కావాలన్నా చేసి పెడతాం అంటూ తెలిపేవారు. అయితే అందుకు డబ్బులు ఖర్చు అవుతాయంటూ కోట్లు గుంజేవారు. ముఖ్యంగా అభిలిప్సా మైనింగ్, నిర్మాణం, బహుళజాతి వ్యాపారాలు చేసే ధనవంతులను లక్ష్యంగా చేసుకుని వారితో పరిచయాలు పెంచుకునేది. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకునే కీల నిర్ణయాలను తాను మార్చగలనని.. తన మాటే అందరూ వింటారని నమ్మించేది. ఇలా అనేక మందిని మోసం చేసి కోట్లు కొల్లగొట్టిన ఈ జంటపై డిసెంబర్ 26వ తేదీన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా... అభిలిప్సా, ఆమె భర్త అనిల్ మొహంతిలు పీకే మిశ్రా కుటుంబానికి చెందిన వారు కాదని గుర్తించారు. అమాయక ప్రజలను మోసం చేసేందుకే వారు అలా నటించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. అలాగే కోట్లు కొల్లగొట్టిన ఆ కిలాడీలను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపడుతున్నారు. వీరి చేతిలో ఇంకెవరైనా మోసపోయి ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని డీసీపీ స్వరాజ్ దేబాటా ప్రజలకు సూచించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #India #Modi #Scams