ఆ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన సీఎం! ఎందుకంటే!

Header Banner

ఆ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన సీఎం! ఎందుకంటే!

  Wed Jan 01, 2025 11:00        India

తెగల మధ్య గొడవలతో ఇటీవల మణిపూర్ అట్టుడికింది. ఈ ఏడాది ఆ రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ క్షమాపణలు చెప్పారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రజలకు ఎంతో కష్టంగా గడిచిపోయిందని, ఎంతో మంది తమ కుటుంబాలను కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. 

 

తెగల వైరంతో దాదాపు 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని బీరేన్ సింగ్ చెప్పారు. చాలామంది ఇళ్లను వదిలిపెట్టి పోయారని తెలిపారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని, 625 మంది నిందితులు అరెస్టయ్యారని చెప్పారు. పోలీసులు మొత్తం 5,600 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. 

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

అయితే గత నాలుగు నెలలుగా రాష్ట్రంలో శాంతి నెలకొందని బీరేన్ సింగ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తగినంత భద్రతా సిబ్బందిని పంపిందని చెప్పారు. కొత్త సంవత్సరంలో పూర్తిస్థాయిలో శాంతి స్థాపన జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన తప్పిదాలను క్షమించుదామని, చేదు జ్ఞాపకాలను మర్చిపోదామని చెప్పారు. అన్ని జాతుల ప్రజలు కలసికట్టుగా జీవించాలని విజ్ఞప్తి చేశారు. 

 

అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్త సంవత్సరంలో అందరం కొత్త జీవితాలను ప్రారంభిద్దామని బీరెన్‌ సింగ్‌ పిలుపునిచ్చారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రాష్ట్రానికి మరో 9 ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం!

 

జగన్ అండదండలతో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపి! డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ!

 

31/12 నుంచి 11/01 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మటన్ ఎలా పడితే అలా తినకండి! కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం!

 

చంద్రబాబు మంచితనమే మీరంతా ఐదు నెలలకే రోడ్లపైకి! వైకాపా వ్యాఖ్యలపై ఘాటైన హెచ్చరిక!

 

87 ఏళ్ల రికార్డు బ్రేక్‌.. చ‌రిత్ర సృష్టించిన‌ భార‌త్‌ఆసీస్ బాక్సింగ్ డే మ్యాచ్‌! ఐదు రోజుల్లో..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #India #Manipur #CM #IndianPeople