నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్! 32 వేల ఉద్యోగాలు.. వివరాలు ఇవిగో!

Header Banner

నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్! 32 వేల ఉద్యోగాలు.. వివరాలు ఇవిగో!

  Sat Jan 04, 2025 11:26        Employment

నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే శాఖలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న దాదాపు 32వేల లెవెల్ 1 (గ్రూపు డి ) పోస్టుల భర్తీకి రైల్వే బోర్డు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో విద్యార్హతల విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఉద్యోగాల భర్తీకి అవసరమైన కనీస విద్యార్హత ప్రమాణాలను సడలించింది. కొత్త ప్రమాణాల ప్రకారం.. పదో తరగతి లేదా ఐటీఐ డిప్లొమా లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ కలిగిన ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవల విడుదలైన నోటీసులో టెక్నికల్ విభాగాల్లో పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనీస విద్యార్హత పదో తరగతితో పాటు ఎన్ఏసీ సర్టిఫికెట్ లేదా ఐటీఐ డిప్లొమా కలిగి ఉన్న వారిని మాత్రమే అర్హులుగా పేర్కొన్నది.

 

ఇంకా చదవండి: గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు! ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ప్రస్తుతం స్టేటస్ ఏంటంటే!

 

అయితే తాజాగా, ఆ విద్యార్హత ప్రమాణాలను సడలిస్తూ నిర్ణయం ప్రకటించింది. రైల్వే శాఖలోని పలు విభాగాల్లో పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్ సహా దాదాపు 32 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరించనున్నారు. ట్రాఫిక్, ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ పోస్టుల భర్తీకి వయో పరిమితి (జనవరి 7, 2025 నాటికి) 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్ధులకు వయో సడలింపు కల్పించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ప్రారంభ జీతం రూ.18వేలు.


ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు..

తల్లికి వందనం పథకం అమలుకు డేట్ ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!

నేడు (4/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఇకపై తెలుగులోనూ ఉత్తర్వులు ఇవ్వాలి! ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!

HDFC నుంచి మరో 2 కొత్త పథకాలు! రూ.100 ఉంటే చాలు! పూర్తి వివరాలు ఇవే!

రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్​ ఫోన్లు ఇవే! వాటి ధరలు మారే అవకాశం.. Don't Miss!

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! మరో కొత్త రైల్వే లైను ప్రకటించిన కేంద్రం!

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు!

జగన్ అరెస్టు, అమెరికా కోర్టులో అభియోగాల తర్వాత ఈ ఒప్పందం! చంద్రబాబు ఏమన్నారంటే?

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్! 6 లేన్లతో హైవేకు రూ.1000 కోట్లు మంజూరు!

కొత్త ఏడాదిలో మరో కొత్త స్కీమ్! రూ.500 ఉంటే చాలు! జనవరి 16 వరకే ఛాన్స్!

ఆకాశమే హద్దుగా కుప్పం అభివృద్ధి.. అన్నింటా అద్భుతం! సాంకేతిక ప్రణాళికలు సిద్ధం!

గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్స్ వాడుతున్నారా? ఇక ఆ UPI ఐడీలు పని చేయవు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Jobs #Employment #AndhraPradesh #JobMella