రాబోయే 5 సం|| లో మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉండాలి! ఎన్నారైలతో సీఎం చంద్రబాబు!

Header Banner

రాబోయే 5 సం|| లో మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉండాలి! ఎన్నారైలతో సీఎం చంద్రబాబు!

  Sat Jan 04, 2025 09:37        Europe, U S A, Australia

ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు.

మొన్న జరిగిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల కోసం ఎన్నారైలు ఎంతో కష్టపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం చంద్రబాబు వారానికి ఒక సారి ఎన్నారైలను కలిసి అభినందనలు తెలియజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ వారం అమెరికా, యూకే, ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా నుండి వచ్చిన ఎన్నారైలు ఎన్ఆర్ఐ టిడిపి సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును కలవడం జరిగింది. అక్కడ సీఎం చంద్రబాబు ఎన్నారై లను కలిసి వారిని అభినందించారు.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈరోజు కలిసిన వారి వివరాలకు లోకి వెళితే అమెరికా నుండి ప్రకాష్, యూకే నుండి ఆదిత్య మరియు వారి భార్య రూప, భాను, సౌత్ ఆఫ్రికా నుండి శ్రీనాథ్ మరియు వారి భార్య రాధ (NRI TDP జనరల్ సెక్రటరీ) మరియు వారి పిల్లలు ఆస్ట్రేలియా నుండి విజయ్ చెన్నుపాటి, అనిల్ సూరపనేని, మృదుల సూర్యదేవర, రాజేష్ వల్లూరి, రాజేష్ ముమ్మినేని, ప్రసాద్ కమ్మ, సుభాష్ నిమ్మగడ్డ సీఎం చంద్రబాబు గారిని కలిశారు. సీఎం చంద్రబాబు గారికి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఎన్నారైలు కలవడం ఆలస్యం అయ్యింది. దాదాపు రాత్రి 10.30 సమయంలో వారిని ఓపికగా కలసి వారి వివరాలు అడిగి తెలుసుకొని అందరినీ పేరుపేరునా అభినందించారు. ఇలా సీఎం గారు ఇంత ఓపికగా వారిని కలిసి మాట్లాడడం ఎంతో సంతోషంగా మరియు ఆశ్చర్యంగా ఉంది అని వారు, వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ సంధర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాబోయే 5 సంవత్సరాలలో ఎన్నారైలు వ్యాపారవేత్తలుగా మరో 10 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఉండాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఇకపై తెలుగులోనూ ఉత్తర్వులు ఇవ్వాలి! ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు! 

 

HDFC నుంచి మరో 2 కొత్త పథకాలు! రూ.100 ఉంటే చాలు! పూర్తి వివరాలు ఇవే! 

 

రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్​ ఫోన్లు ఇవే! వాటి ధరలు మారే అవకాశం.. Don't Miss! 

 

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! మరో కొత్త రైల్వే లైను ప్రకటించిన కేంద్రం! 

 

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు! 

 

జగన్ అరెస్టుఅమెరికా కోర్టులో అభియోగాల తర్వాత ఈ ఒప్పందం! చంద్రబాబు ఏమన్నారంటే? 

 

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్! 6 లేన్లతో హైవేకు రూ.1000 కోట్లు మంజూరు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #TDP #NRITDP #Poland #Associations #USA #UK #Australia