పిఠాపురంలో జనసేన మహాసభలు.. ఆ మూడు రోజులు పండగే! తేదీలు ఇవే!

Header Banner

పిఠాపురంలో జనసేన మహాసభలు.. ఆ మూడు రోజులు పండగే! తేదీలు ఇవే!

  Sat Jan 04, 2025 11:37        Politics

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ నిర్వహణ వేదిక, తేదీలు ఖరారు అయ్యాయి. జనసేన పార్టీ అధినేత, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ తను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే మార్చి 12, 13, 14 తేదీల్లో ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు. జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ప్లీనరీ సన్నాహాలపై శుక్రవారం విజయవాడలో కోర్ కమిటీ సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పవన్ బలంగా నిలబడ్డారని, దాంతో కూటమి ప్రభుత్వ స్థాపనలో జనసేన పాత్ర క్రియాశీలకమైందని చెప్పారు.

 

ఇంకా చదవండి: గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు! ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ప్రస్తుతం స్టేటస్ ఏంటంటే!

 

ఈ క్రమంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్లీనరీ నిర్వహణకు వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పార్టీ సిద్దాంతాలు, పవన్ ఆశయాలు ప్రజల్లో మరింతగా తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి పార్టీ నాయకులు, మేధావుల నుంచి ప్లీనరీలో సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. మార్చి 12వ తేదీ ఉదయం ప్లీనరీ ప్రారంభోత్సవం ఉంటుందని, 14న బహిరంగ సభ జరుగుతుందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 


ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు..

తల్లికి వందనం పథకం అమలుకు డేట్ ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!

నేడు (4/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఇకపై తెలుగులోనూ ఉత్తర్వులు ఇవ్వాలి! ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!

HDFC నుంచి మరో 2 కొత్త పథకాలు! రూ.100 ఉంటే చాలు! పూర్తి వివరాలు ఇవే!

రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్​ ఫోన్లు ఇవే! వాటి ధరలు మారే అవకాశం.. Don't Miss!

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! మరో కొత్త రైల్వే లైను ప్రకటించిన కేంద్రం!

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు!

జగన్ అరెస్టు, అమెరికా కోర్టులో అభియోగాల తర్వాత ఈ ఒప్పందం! చంద్రబాబు ఏమన్నారంటే?

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్! 6 లేన్లతో హైవేకు రూ.1000 కోట్లు మంజూరు!

కొత్త ఏడాదిలో మరో కొత్త స్కీమ్! రూ.500 ఉంటే చాలు! జనవరి 16 వరకే ఛాన్స్!

ఆకాశమే హద్దుగా కుప్పం అభివృద్ధి.. అన్నింటా అద్భుతం! సాంకేతిక ప్రణాళికలు సిద్ధం!

గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్స్ వాడుతున్నారా? ఇక ఆ UPI ఐడీలు పని చేయవు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #PawanKalyan #Repalle #VarahiVijayabheri #Janasena #TDP-JanaSena-BJPAlliance #Jagan #YSRCP