విప‌రీతంగా మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల హ్యాంగోవ‌ర్ అవుతుందా? ఈ చిట్కాల‌ను పాటించండి చాలు!

Header Banner

విప‌రీతంగా మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల హ్యాంగోవ‌ర్ అవుతుందా? ఈ చిట్కాల‌ను పాటించండి చాలు!

  Wed Jan 01, 2025 11:30        Life Style

మ‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ చాలా మంది విప‌రీతంగా మ‌ద్యం సేవిస్తూనే ఉంటారు. ఇక కొంద‌రు అయితే మ‌ద్యం మళ్లీ దొరుకుతుందో లేదో అని చెప్పి పీక‌ల దాకా సేవిస్తుంటారు. ఆపై ఇష్టం వ‌చ్చిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తుంటారు. కొంద‌రు మ‌ద్యం విప‌రీతంగా సేవించి వాంతులు చేసుకుంటారు. అయితే మ‌ద్యం విప‌రీతంగా సేవించిన త‌రువాత కొన్ని గంట‌ల‌కు ఉద‌యం లేదా రాత్రి ఎప్పుడైనా స‌రే హ్యాంగోవ‌ర్ వ‌స్తుంది. తీవ్ర‌మైన త‌ల‌నొప్పి, వికారం వంటి స‌మ‌స్య‌లు ఉంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే హ్యాంగోవ‌ర్ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

 

మ‌సాలా టీ..
బాగా హ్యాంగోవ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారు మ‌సాలా చాయ్‌ని సేవించాలి. యాల‌కులు, ల‌వంగాలు, మిరియాలు, శొంఠి వేసి త‌యారు చేసిన మ‌సాలా టీని సేవిస్తే హ్యాంగోవ‌ర్ దెబ్బ‌కు ఎగిరిపోతుంది. దీంతోపాటు త‌ల‌నొప్పి కూడా త‌గ్గుతుంది. హ్యాంగోవ‌ర్‌ను త‌గ్గించ‌డంలో మసాలా టీ అద్భుతంగా ప‌నిచేస్తుంది. ఆయా మ‌సాలాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, స‌మ్మేళ‌నాలు మెద‌డును యాక్టివ్‌గా మారుస్తాయి. మైండ్ రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. మెద‌డులో ఉండే ర‌క్త నాళాల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా పెరుగుతుంది. దీంతో మైండ్ రిలాక్స్ అవుతుంది. హ్యాంగోవ‌ర్‌, త‌ల‌నొప్పి త‌గ్గుతాయి. క‌నుక తీవ్ర‌మైన హ్యాంగోవ‌ర్ ఉన్న‌వారు మ‌సాలా టీని ట్రై చేసి చూడండి. 

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

నిమ్మ‌ర‌సం, తేనె..
ఇక హ్యాంగోవర్ నుంచి బ‌య‌ట ప‌డేందుకు నిమ్మ‌ర‌సం క‌లిపిన మ‌జ్జిగ కూడా ఎంత‌గానో ప‌నిచేస్తుంది. నిమ్మ‌ర‌సంలో ఉండే విట‌మిన్ సి మ‌న‌ల్ని తాజాగా ఉంచేలా చేస్తుంది. దీంతో మెద‌డు యాక్టివ్‌గా మారుతుంది. ఉత్తేజంగా ప‌నిచేస్తుంది. అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కాస్త నిమ్మ‌ర‌సం, తేనె క‌లిపి తాగినా కూడా హ్యాంగోవ‌ర్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ మిశ్ర‌మంతో త‌ల‌నొప్పి కూడా త‌గ్గుతుంది. అలాగే వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ఇక ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డేందుకు అల్లం ర‌సం కూడా ఎంతో ప‌నిచేస్తుంది. ఇది తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. గ్యాస్‌, అసిడిటీ లేకుండా చేస్తుంది. అలాగే శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. దీంతో హ్యాంగోవ‌ర్‌, త‌ల‌నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

 

హెర్బ‌ల్ ఆయిల్ మ‌సాజ్‌..
తీవ్ర‌మైన హ్యాంగోవర్ ఉంటే త‌ల‌కు ఏదైనా హెర్బ‌ల్ ఆయిల్‌తో మ‌సాజ్ కూడా చేయ‌వ‌చ్చు. దీంతో త‌ల‌లో ర‌క్త స‌ర‌ఫ‌రా పెరుగుతుంది. హ్యాంగోవ‌ర్‌, త‌ల‌నొప్పి త‌గ్గుతాయి. అదేవిధంగా కాఫీ లేదా గ్రీన్ టీ సేవించినా కూడా ఈ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. వీటిల్లో ఉండే కెఫీన్ మెద‌డును ఉత్తేజితం చేస్తుంది. దీని వ‌ల్ల త‌ల‌నొప్పి ఇట్టే త‌గ్గిపోతుంది. అదేవిధంగా యాపిల్ లేదా అర‌టి పండ్ల‌ను తింటున్నా కూడా హ్యాంగోవ‌ర్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. పుదీనా ఆకుల‌ను న‌మిలి తింటున్నా లేదా గోరు వెచ్చ‌ని నీటిలో తేనె క‌లిపి తాగుతున్నా కూడా హ్యాంగోవ‌ర్‌, త‌ల‌నొప్పి త‌గ్గిపోతాయి. వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం నుంచి కూడా విముక్తి ల‌భిస్తుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రాష్ట్రానికి మరో 9 ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం!

 

జగన్ అండదండలతో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపి! డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ!

 

31/12 నుంచి 11/01 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మటన్ ఎలా పడితే అలా తినకండి! కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం!

 

చంద్రబాబు మంచితనమే మీరంతా ఐదు నెలలకే రోడ్లపైకి! వైకాపా వ్యాఖ్యలపై ఘాటైన హెచ్చరిక!

 

87 ఏళ్ల రికార్డు బ్రేక్‌.. చ‌రిత్ర సృష్టించిన‌ భార‌త్‌ఆసీస్ బాక్సింగ్ డే మ్యాచ్‌! ఐదు రోజుల్లో..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #LifeStyle #Alcohol #Hangover #Remedies