బే పార్క్ రిసార్ట్ వెనుక వైకాపా రాజకీయ కుట్రలు? సిట్ విచారణ ద్వారా నిజాలు వెలుగులోకి...!

Header Banner

బే పార్క్ రిసార్ట్ వెనుక వైకాపా రాజకీయ కుట్రలు? సిట్ విచారణ ద్వారా నిజాలు వెలుగులోకి...!

  Wed Jan 01, 2025 10:28        Politics

వైకాపా హయాంలో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ సెజ్లలోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నట్లే.. విశాఖ- భీమిలి బీచ్ రోడ్డులోని రుషికొండ పైనున్న బే పార్క్ రిసార్ట్ను కూడా వైకాపా నేతలు చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. కొందరు అధికారులు గత ప్రభుత్వంలో కీలక నేత అనుయాయులకు లబ్ధి చేకూర్చేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు ఎసరు పెట్టినట్లు సమాచారం. చట్టవిరుద్ధంగా జరిగిన ప్రాజెక్టు హక్కుల బదలాయింపుపై సిట్ ఏర్పాటుచేసి, విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. రుషికొండపై 28 ఎకరాలు, సముద్ర తీరాన్ని ఆనుకొని మరో 5.75 ఎకరాల స్థలాన్ని 2000 సంవత్సరంలో నాటి రాష్ట్ర ప్రభుత్వం బే పార్క్ రిసార్ట్ ప్రాజెక్టుకు 33 ఏళ్ల లీజుపై అప్పగించింది. దీని నిర్వాహకుడు కొండపై వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేశారు.



ఇంకా చదవండిజగన్ ప్రభుత్వం ఆ పైసలను పక్కదారి పట్టించింది! వైసీపీ ప్రభుత్వ చీకటి జీఓలతో..



ఇందుకు ప్రభుత్వానికి ఏటా రూ.10 లక్షలు లీజు చెల్లించేవారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ పెద్దలు కొందరు ఈ ప్రాజెక్టుపై కన్నేశారు. దాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రణాళిక రూపొందించారు. నిర్వాహకుడే అప్పగించేలా కథ నడిపించారు. ఇందుకు అతనిపై ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. 33 ఏళ్ల లీజును ఏకంగా 90 ఏళ్లకు పొడిగించారు. 2020-25 పర్యాటక విధాన నిబంధనలను పట్టించుకోలేదు. పాత ఒప్పందమే కొనసాగించేలా చక్రం తిప్పారు. రిసార్ట్లో పాటు ఖాళీగా ఉన్న భూములనూ దక్కించుకున్నారు. ఇదంతా గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పట్టణ మౌలిక వసతులు, ఆస్తులు నిర్వహణ సంస్థ (ఏపీయూఐఏఎంఎల్)లో కీలక హోదాలో పనిచేసి, జగన్ పట్ల వీరాభిమానాన్ని ప్రదర్శించిన వ్యక్తే చేయించినట్లు సమాచారం.



ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!



పాత సంస్థ నుంచి కొత్త సంస్థకు లీజు హక్కులు బదలాయింపు విధానం నిబంధనల ప్రకారం జరగలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. పెద్దల కోసం ఓ కంపెనీని సృష్టించి, దానికి అర్హత లేకపోయినా అప్పగించేలా అప్పటి సీఎంవో నుంచి ప్రణాళిక అమలు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో కాకినాడ సీపోర్టు, విశాఖలో బే పార్క్ సహా మరికొన్ని ప్రాజెక్టులు పెద్దల చేతుల్లోకి వెళ్లేలా ఏపీయూఐఏఎంఎల్ పనిచేసిన ఒకరు న్యాయసలహాదారుగా దగ్గరుండి చేయించారన్న విమర్శలున్నాయి.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



ఏపీ సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక బాధ్యతలు! ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

 

కోటప్పకొండను సందర్శించిన చంద్రబాబు! పల్నాడు జిల్లా యల్లమందలో..

 

ఐదు కోట్ల మంది ప్రజల కోసమే కష్టపడుతున్నా - సీఎం చంద్రబాబు! పర్యటనలో కీలక ప్రకటనలు!

 

ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ కు కొత్త చార్జీలు! ఎప్పటి నుంచి అంటే!

 

వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలుఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీతెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #seaport #baypark #resort #todaynews #flashnews #latestupdate