సకల హంగులతో విశాఖ క్రూజ్ టెర్మినల్! వైజాగ్ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం!

Header Banner

సకల హంగులతో విశాఖ క్రూజ్ టెర్మినల్! వైజాగ్ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం!

  Wed Jan 01, 2025 11:24        Others

విశాఖను అంతర్జాతీయ పర్యాటక యవనికపై నిలిపే క్రూజ్ టెర్మినల్ పూర్తి హంగులతో సిద్ధమైంది. వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ (ఐసీటీ)గా పిలిచే దీన్ని రూ.96.05 కోట్లతో కేంద్ర పర్యాటకశాఖ (రూ.38.50 కోట్లు), విశాఖ పోర్టు ట్రస్ట్) రూ.57.55 కోట్లు సంయుక్తంగా నిర్మించాయి. దీన్ని నౌక ఆకారంలో, రెండువేల మందిని తీసుకెళ్లగల సామర్థ్యం గల క్రూజ్లు నిలిపేందుకు వీలుగా సిద్ధం చేశారు. కస్టమ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ సేవా కౌంటర్లు, రిటైల్ అవుట్లెట్లు, డ్యూటీఫ్రీ షాపులు, ఫుడ్ కోర్టులు, లాంజ్లతో టెర్మినల్ సిద్ధమైంది. 2023 సెప్టెంబరులో దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. 2024 ఏప్రిల్లో ప్రపంచంలోనే అతి పెద్ద లగ్జరీ క్రూజ్ షిప్ ద వరల్డ్ ఇక్కడికి వచ్చింది. 2025 మార్చి నుంచి ఇక్కడ పూర్తిస్థాయి కార్యకలాపాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్డిలియా, రాయల్ కరేబియన్, ఎంఎస్సీ వంటి ప్రముఖ క్రూజ్ లైనర్లతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. సింగపూర్, థాయిలాండ్, శ్రీలంక సహా వివిధ దేశాలకు, చెన్నై, సుందర్బన్స్ వంటి ప్రాంతాలకు ఇక్కడి నుంచి క్రూజ్లు నడిపేలా ప్రయత్నాలు చేస్తున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



ఏపీ సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక బాధ్యతలు! ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

 

కోటప్పకొండను సందర్శించిన చంద్రబాబు! పల్నాడు జిల్లా యల్లమందలో..

 

ఐదు కోట్ల మంది ప్రజల కోసమే కష్టపడుతున్నా - సీఎం చంద్రబాబు! పర్యటనలో కీలక ప్రకటనలు!

 

ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ కు కొత్త చార్జీలు! ఎప్పటి నుంచి అంటే!

 

వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలుఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీతెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం!

 

జగన్ అండదండలతో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపిడెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #international #vizag #cruizeterminal #tourism #todaynews #flashnews #latestupdate