దేశంలో అత్యంత చలి ప్రదేశాలు ఇవే! మైనస్‌లో టెంపరేచర్!

Header Banner

దేశంలో అత్యంత చలి ప్రదేశాలు ఇవే! మైనస్‌లో టెంపరేచర్!

  Wed Jan 01, 2025 12:34        India

ఉత్తరాది రాష్ట్రాలను చలి వెంటాడుతోంది. గజగజమంటూ వణికిస్తోంది. చలిగాలులు దాదాపుగా అన్ని రాష్ట్రాలను చుట్టుముట్టాయి. దట్టమైన పొగమంచు అలముకుంటోంది. దేశ రాజధాని సహా నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గడ్డకట్టించే వాతావరణం నెలకొంటోంది.

 

హిమాలయ పర్వత శ్రేణుల మీదుగా వీస్తోన్న చలిగాలులు, అక్కడ కురుస్తోన్న మంచు వర్షం వల్ల చలిగాలుల తీవ్రత ఇక్కడ ఒక్కసారిగా పెరిగింది. విపరీతంగా కురుస్తోన్న మంచు వల్ల హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లఢక్.. తడిచి ముద్దవుతున్నాయి. రోడ్లపై భారీగా మంచు పేరుకుపోవడం వల్ల వాహనాల రాకపోకలు సైతం మందగించాయి.

 

జమ్మూ కాశ్మీర్, లఢక్‌లల్లో ఉష్ణోగ్రత మైనస్‌లల్లో పడిపోయింది. ఫలితంగా శ్రీనగర్‌లో గల ప్రఖ్యాత దాల్ లేక్ గడ్డ కట్టుకుపోయింది. రెండంగుళాల మేర మంచు ఫలకాలు ఆ సరస్సు ఉపరితలంపై ఏర్పడ్డాయి. మంచు దుప్పటి కప్పుకొన్న కాశ్మీర్ అందాలను తిలకించడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు చేరుకుంటోన్నారు.

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

లఢక్‌లోని ద్రాస్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్ 18.3 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయింది. కార్గిల్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ మైనస్ 14.4 డిగ్రీల సెల్సియస్ మేర టెంపరేచర్ నమోదైనట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించిది. రాజధాని లేహ్: -8.2, గిల్గిట్: -5.5, న్యోమా: -11.9, స్కర్దు: - 9.0 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది.

 

చలి తీవ్రత జమ్మూ కాశ్మీర్‌లోనూ నెలకొంది. గుల్మార్గ్‌లో ఉష్ణోగ్రత మైనస్ 8.8గా రికార్డయింది. పెహల్‌గామ్: -7.6, ఖాజీ గుండ్: -6.0, శ్రీనగర్: -4.4 డిగ్రీల సెల్సియస్ మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హిమాచల్ ప్రదేశ్‌లోని కల్పాలో కనిష్ఠ ఉష్ణోగ్రత -3.8గా నమోదైంది.

 

అటు దేశ రాజధానినీ చలి చుట్టుముట్టింది. సఫ్దర్‌గంజ్‌లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలోని అన్ని ప్రాంతాలు చలి గుప్పిట్లో చిక్కుకున్నాయి. దట్టమైన పొగమంచు ఆయా ప్రాంతాలను అలముకుంది. నిరాశ్రయులు, పేదల కుటుంబాల వారి కోసం ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేకంగా నైట్ షెల్టర్లను ఏర్పాటు చేసింది. వాళ్లంతా అక్కడే తలదాచుకుంటోన్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #India #Travel #Tourism #Cold #Cool