కూలీ నుండి లాటరీ కింగ్‌! ఏటా రూ.15వేల కోట్ల టర్నోవర్! ఈడీ దర్యాప్తులో సంచలన నిజాలు!

Header Banner

కూలీ నుండి లాటరీ కింగ్‌! ఏటా రూ.15వేల కోట్ల టర్నోవర్! ఈడీ దర్యాప్తులో సంచలన నిజాలు!

  Fri Jan 03, 2025 19:08        Business

అతడు ఒకప్పుడు సాధారణ కూలీ. కానీ ఇప్పుడు మాత్రం వేల కోట్లు సంపాదించాడు. దానికి కారణం లాటరీలు. లాటరీ బిజినెస్‌లో అవకతవకలు చేసిన ఆ వ్యక్తి ఏకంగా లాటరీ కింగ్‌గా ఎదిగాడు. ఇక లాటరీ బిజినెస్‌లో ఏటా రూ.15 వేల కోట్ల టర్నోవర్ జరిపినట్లు అధికారులు గుర్తించారు. అయితే అతడి బిజినెస్‌లో అవకతవకలు గుర్తించడంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు సంచలన విషయాలు కనుగొన్నారు. ఆ లాటరీ కింగ్‌కు చెందిన రూ.1000 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు.

 

లాటరీ కింగ్‌ శాంటియాగో మార్టిన్‌.. వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ అధికారుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ఎలక్షన్ బాండ్ల సమాచారం బయటికి వచ్చి సమయంలో లాటరీ కింగ్ శాంటియాగో మార్టినే పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. వివిధ పార్టీలకు ఎన్నికల బాండ్ల రూపంలో ఈ లాటరీ కింగ్‌ శాంటియాగో మార్టిన్‌.. ఏకంగా 5 ఏళ్లలోనే రూ.1300 కోట్లు వివిధ రాజకీయ పార్టీలకు అందించాడు. ఇదంతా లాటరీ బిజినెస్‌తో సంపాదించిందే కావడం గమనార్హం. అయితే లాటరీ బిజినెస్‌లో మోసాలకు పాల్పడి వేల కోట్ల సంపదను కూడబెట్టినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఒక్క ఏడాదిలోనే రూ.15 వేల కోట్లు సంపాదించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తులో వెల్లడైంది. ఈడీ దాడులతో శాంటియాగో మార్టిన్ ఆస్తులు, మోసాలు మొత్తం వెలుగులోకి వచ్చాయి. 

 

ఫ్యూచర్‌ గేమింగ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థను స్థాపించిన శాంటియాగో మార్టిన్‌.. లాటరీల పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో 2014లో దీనిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత 2018లో శాంటియాగో మార్టిన్‌ సహా ఆయన బంధువులు, ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్‌లో పనిచేసిన ఉద్యోగులపై ఈడీ అధికారులు మనీలాండరింగ్‌ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఇటీవల అతడి రూ.1000 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఈ క్రమంలోనే మరింత లోతైన దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు బయటికి వచ్చాయి.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిఈ పండ్లు వేర్వేరుగా తింటేనే ఆరోగ్యానికి మంచిది! కలిపి తింటే ఇంక అంతే! 

 

లాటరీ బిజినెస్‌లో వచ్చిన అక్రమ సొమ్ముతో ఆస్తులు కొనేందుకు శాంటియాగో మార్టిన్‌ ఏకంగా 350కి పైగా బోగస్ కంపెనీలను ప్రారంభించినట్లు తేలింది. అంతేకాకుండా ఎన్నో కార్లు కొనుగోలు చేశాడు. లాటరీ టికెట్లు కొనే వారికి కచ్చితంగా లాటరీ తగిలే టికెట్లను విక్రయించి.. వారి నుంచి ఆస్తులను కొనుగోలు చేసేవాడని దర్యాప్తులో ఈడీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా.. తన బంధువులు, ఫ్రెండ్స్‌ను లాటరీ డిస్ట్రిబ్యూటర్లుగా నియమించాడు. వీళ్లు ప్రైజ్‌ విన్నింగ్‌ లాటరీ టికెట్లను తమ వద్దే ఉంచుకుని మిగతా టికెట్లను మాత్రమే అమ్మేవారు.

 

ఈడీ అధికారుల తనిఖీల్లో అలాంటి వందలాది టికెట్ల కట్టలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈడీ అటాచ్‌ చేసిన ఆస్తుల్లో కొన్నింటిని శాంటియాగో మార్టిన్‌ అమ్మేసినట్లు అధికారులు గుర్తించారు. లాటరీ టికెట్లు విక్రయించి.. ఫ్యూచర్‌ గేమింగ్‌ సంస్థ ఏడాదికి రూ.15వేల కోట్ల ఆదాయాన్ని పొందినా.. ప్రభుత్వానికి మాత్రం చాలా తక్కువ మొత్తంలో లాభాలను చూపించిందని ఈడీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ ఫ్యాచర్ గేమింగ్ కంపెనీకి సిక్కిం ప్రభుత్వ లాటరీ స్కీమ్‌ నుంచే భారీగా లాభాలు వచ్చాయని.. ఆ తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్‌ ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

 

భారత్‌కు పొరుగున ఉన్న మయన్మార్‌లో సాధారణ కూలీ అయిన శాంటియాగో మార్టిన్‌.. 1988లో భారత్‌కు వచ్చాడు. తమిళనాడులో లాటరీ వ్యాపారం ప్రారంభించి కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు విస్తరించాడు. ఆ తర్వాత ఈశాన్య భారతదేశానికి మారిన శాంటియాగో మార్టిన్.. అక్కడ ప్రభుత్వ లాటరీ స్కీమ్‌లతో బిజినెస్ మొదలుపెట్టాడు. కొన్నేళ్లకు భూటాన్‌, నేపాల్‌లోనూ తన బిజినెస్‌లను విస్తరించాడు. ఆ తర్వాత స్థిరాస్తి, నిర్మాణ, టెక్స్‌టైల్‌, ఆతిథ్య రంగాల్లోకి అడుగుపెట్టి.. ఫ్యూచర్‌ గేమింగ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రారంభించాడు. ఈ సంస్థకు వరల్డ్‌ లాటరీ అసోసియేషన్‌లో సభ్యత్వం కూడా ఉండటం గమనార్హం. ఈ కంపెనీ ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినో వంటి వాటిని కూడా నిర్వహిస్తుంది. ఇక ఈ సంస్థ నుంచి వచ్చిన డబ్బుతో 2019-2024 మధ్య రూ.1300 కోట్ల ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసి.. వివిధ పార్టీలకు విరాళంగా ఇచ్చినట్లు ఇటీవల వెల్లడైంది. డీఎంకే, టీఎంసీ వంటి పార్టీలకు రూ.వందల కోట్ల విరాళాలను శాంటియాగో మార్టిన్ అందినట్లు తెలిసింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కొత్త ఏడాదిలో మరో కొత్త స్కీమ్! రూ.500 ఉంటే చాలు! జనవరి 16 వరకే ఛాన్స్! 

 

ఆకాశమే హద్దుగా కుప్పం అభివృద్ధి.. అన్నింటా అద్భుతం! సాంకేతిక ప్రణాళికలు సిద్ధం! 

 

గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్స్ వాడుతున్నారా? ఇక ఆ UPI ఐడీలు పని చేయవు! 

 

శబరిమల వెళ్ళేవారికి సూపర్ గుడ్ న్యూస్! గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం రంగం సిద్ధం! 

 

ఏపీ క్యాబినెట్ భేటీలో సీఏం చంద్రబాబు కీలక నిర్ణయాలు! ఆ పథకాల అమలుకు ముహూర్తం ఫిక్స్! 

 

టీడీపీ కార్యకర్తలకు మంత్రి లోకేష్ గుడ్ న్యూస్! దేశ చరిత్రలో తొలిసారి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Business #Coolie #Businessman #Lottery