మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బెస్ట్ స్కీమ్స్! ఎందులో ఎంత ఇన్వెస్ట్ చేయాలి!

Header Banner

మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బెస్ట్ స్కీమ్స్! ఎందులో ఎంత ఇన్వెస్ట్ చేయాలి!

  Mon Jan 06, 2025 14:00        Business

తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తుంటారు. ఎదుగుతున్న వయసులో.. తర్వాత పెద్దయిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ముందునుంచే వారి కోసం ఆలోచిస్తుంటారు. ఇప్పుడు.. వారికి మంచి భవిష్యత్తు అందించాలన్న ఉద్దేశంతో పొదుపు, మదుపు చేయాలనుకుంటే ఇప్పుడు ఈ 5 పథకాల గురించి ఆలోచించండి. పెట్టుబడిపై గ్యారెంటీగా రిటర్న్స్ అందిస్తాయి.

 

సంపాదించే వయసులో ఖర్చుల్ని అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే మలి వయసులో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటం సహా మీ పిల్లల్ని కూడా ప్రయోజకులుగా మార్చొచ్చు. పిల్లలు బాగుండాలని వారి పేరిట ఆస్తులు కూడబెట్టడం చూస్తూనే ఉంటాం. చాలా ముందు నుంచే దీని గురించి ఆలోచించడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. సంపాదించే వయసులోనే డబ్బుల్ని పొదుపు చేసి పిల్లల కోసం లేదా పిల్లల పేరిట మదుపు చేయడం అలవర్చుకోవాలి. ఇప్పుడు దేశంలో పిల్లల కోసం అందుబాటులో ఉన్న టాప్- 5 స్కీమ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇందులో ఎన్‌పీఎస్ వాత్సల్య, సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ పథకం, మ్యూచువల్ ఫండ్స్, రికరింగ్ డిపాజిట్లు వంటివి ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాం.

 

NPS వాత్సల్య పథకం- పిల్లల పేరిట చిన్నవయసు నుంచే పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రం తీసుకొచ్చిన స్కీమ్ ఎన్‌పీఎస్ వాత్సల్య. ఇప్పటికే ఉన్న NPS కు అదనంగా దీనిని తెచ్చింది. ఇదొక పెన్షన్ స్కీమ్. కనీసం రూ. 1000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్ట పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు. ప్రభుత్వ పథకం కాబట్టి.. ఇందులో ఎలాంటి నష్టభయం లేదు గ్యారెంటీగా రిటర్న్స్ వస్తాయి.

 

దీంట్లో టైర్- 1, 2 అనే రెండు రకాల ఖాతాలుంటాయి. టైర్- 1 ప్రాథమిక పింఛన్ ఖాతా. దీంట్లో ఉపసంహరణలపై కొన్ని పరిమితులుంటాయి. టైర్- 2 స్వచ్ఛంద పొదుపు పథకం వంటిది. ఇక్కడ సెక్షన్ 80ccd (1b) కింద రూ. 50 వేల వరకు టాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. ఇంకా సెక్షన్ 80c కింద గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు టాక్స్ తగ్గించుకోవచ్చు. రిటైర్మెంట్ తర్వాత NPS నిధిలో నుంచి 60 శాతం మొత్తం ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. మిగతా 40 శాతం మొత్తంతో తప్పనిసరిగా యాన్యుటీ పథకాల్ని కొనుగోలు చేయాలి. దీంతో రిటైర్మెంట్ తర్వాత పింఛన్ పొందేందుకు వీలుంటుంది.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

సుకన్య సమృద్ధి యోజన- ఇది ఆడపిల్లల కోసమే ప్రత్యేకంగా కేంద్రం తీసుకొచ్చిన స్కీమ్. పదేళ్ల లోపు వయసున్న ఆడపిల్లల్ని ఇందులో చేర్పించొచ్చు. అకౌంట్ తెరిచినప్పటి నుంచి 21 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. పాపకు 18 ఏళ్లు నిండితే సగం డబ్బులు తీసుకోవచ్చు. పెళ్లి సమయంలో పూర్తిగా తీసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 తో, గరిష్టంగా రూ. 1.50 లక్షలతో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ప్రస్తుతం 8.20 శాతం వడ్డీ రేటు ఉంది. గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి. ఉదాహరణకు ఇందులో ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం.. మీరు ఏడాదికి రూ. 1.50 లక్షల చొప్పున 15 ఏళ్లు కడితే.. చేతికి అంటే 21 ఏళ్ల తర్వాత రూ. 69 లక్షలకుపైనే వస్తుంది.

 

రికరింగ్ డిపాజిట్- రిస్క్ లేకుండా మంచి రాబడి కోసం రికరింగ్ డిపాజిట్స్ బాగుంటాయి. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ పథకాలు అందుబాటులో ఉంటాయి. దీర్ఘకాలం పాటు వీటిని కొనసాగిస్తే.. మంచి రాబడి వస్తుంది. ఇక్కడ మీరు రెగ్యులర్‌గా (నెలవారీగా) నచ్చినంత డబ్బులు పొదుపు చేయొచ్చు. నిర్దిష్ట వడ్డీ రేటు ప్రకారం.. డబ్బులు వస్తాయి. దీంట్లో కూడా మీరు ఎంత కాలానికి ఎంత పొందొచ్చో ముందే తెలుసుకోవచ్చు. వీటిపై లోన్లు కూడా తీసుకోవచ్చు.

 

పీపీఎఫ్- దీర్ఘకాలిక పొదుపు పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. దీంట్లో ఏడాదికి కనీసం రూ. 500, గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు ఇన్వె్స్ట్ చేయొచ్చు. వడ్డీ రేటు ప్రస్తుతం 7.10 శాతంగా ఉంది. వరుసగా 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేయాలి. ట్రిపుల్ టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. 15 ఏళ్ల టెన్యూర్ అయినా.. ఐదేళ్ల చొప్పున ఎన్ని సార్లయినా పొడిగించుకోవచ్చు. ఇలా గరిష్ట పెట్టుబడిపై 25 ఏళ్లలో కోటీశ్వరులు కావొచ్చు.

 

సిప్ పెట్టుబడులు- మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) విధానంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటిల్లో డెట్, ఈక్విటీ, హైబ్రిడ్ చాలా రకాలే ఉంటాయి. ఇక్కడ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్. టాక్స్ ఆదా చేసుకోవచ్చు. డెట్ ఫండ్స్‌లోనూ రిస్క్ ఉండదు. ఇక్కడ కాంపౌండింగ్ ఎఫెక్ట్ కారణంగా.. పెట్టిన పెట్టుబడిపై చక్రవడ్డీ రూపంలో రాబడి వస్తుంటుంది. నెలకు కొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తూ పోతే కొన్నేళ్లలోనే అద్భుత స్థాయిలో రిటర్న్స్ అందుకోవచ్చు. వార్షిక సగటు రాబడి ఆధారంగా రిటర్న్స్ ఉంటాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే.. 

 

పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్! 

 

ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్! 

 

ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు.. 

 

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! ఎప్పుడుఎందుకు..? 

 

లోకేశ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు భారీ శుభవార్త! ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. అకౌంట్లోకి డబ్బులుచెల్లింపు ఇలా! 

 

పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Business #Investments #Schemes #Government