కెనడా ప్రధాని సంచలన నిర్ణయం! రాజీనామా దిశగా ట్రూడో!

Header Banner

కెనడా ప్రధాని సంచలన నిర్ణయం! రాజీనామా దిశగా ట్రూడో!

  Mon Jan 06, 2025 11:51        Others

కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. లిబరల్‌ పార్టీ అధ్యక్ష పదవితోపాటు ప్రధాని పదవికి ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. రానున్న 48 గంటల్లో ట్రూడో రాజీనామా చేయబోతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

ట్రూడోకు దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అదే సమయంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్‌ పార్టీ గెలుపు అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ట్రూడో భావిస్తున్నట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి. రానున్న 48 గంటల్లోనే ఆయన రాజీనామా ప్రకటన ఉంటుందని లిబరల్‌ పార్టీ నేతలను ఊటంకిస్తూ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే, ప్రధాని పదవికి రాజీనామా చేస్తారా..? లేదా..? అనే విషయంపై స్పష్టత లేదు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

2013లో పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆయన ప్రధాని పదవిని చేపట్టారు. ఇక గత పదేళ్లుగా పదవిలో ఉన్న ట్రూడో ప్రాభవం ఇటీవలి కాలంలో మసకబారుతూ వస్తున్నది. ప్రస్తుతం ట్రూడోపై దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెరుగుతున్న ధరలు, ఇళ్ల సంక్షోభానికి కారణమైన ట్రూడోపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఆయన నాయకత్వాన్ని మార్చాలంటూ సొంత పార్టీ నేతల నుంచే ఒత్తిడి తీవ్రంగా ఉంది. 2025 అక్టోబర్‌లో కెనడా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే.. 

 

పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్! 

 

ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్! 

 

ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు.. 

 

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! ఎప్పుడుఎందుకు..? 

 

లోకేశ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు భారీ శుభవార్త! ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. అకౌంట్లోకి డబ్బులుచెల్లింపు ఇలా! 

 

పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Canada #Employment #WorkPermit #Immigrants