చైనాతో పాటు మలేషియాలోనూ కొత్త వైరస్! ప్రభుత్వం కీలక గైడ్‌లైన్స్ జారీ!

Header Banner

చైనాతో పాటు మలేషియాలోనూ కొత్త వైరస్! ప్రభుత్వం కీలక గైడ్‌లైన్స్ జారీ!

  Mon Jan 06, 2025 13:06        Malaysia

దాదాపు కరోనా వైరస్ లాంటి లక్షణాలే చైనాలో వెలుగులోకి వచ్చిన కొత్తరకం వైరస్‌లో ఉంటున్నాయి. ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపించే ఈ వైరస్.. తుమ్ము, దగ్గు, లాలాజలం ద్వారా ఇతరుకలు సోకుతుంది. అయితే, ఇది కొత్త తరహా వైరస్ కాదని.. 2001లోనే దీనిని గుర్తించారని నిపుణులు చెబుతున్నారు. కానీ, ప్రస్తుతం ఇది చైనాలోని పలు ప్రాంతాల్లో వేగంగా వ్యాప్తి చెందడం ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే ఐదేళ్ల కిందట ఇలాగే కరోనా కూడా చైనాలోనే వెలుగులోకి వచ్చింది. 

 

చైనాలో కొత్తరకం వైరస్ వ్యాప్తి మరో ప్రపంచ మహమ్మారిగా మారుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇతర దేశాల్లోనూ ఈ వైరస్ అడుగుపెట్టినట్టు నివేదికలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో మలేషియాలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదవుతుండటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. స్ట్రెయిట్ టైమ్స్ ప్రకారం.. వైరస్ నియంత్రణకు మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీచేసింది. సబ్బుతో తరుచూ చేతులను శుభ్రం చేసుకోవాలని, జలుబు దగ్గుతో బాధపడేవారు మాస్క్‌లు ధరించాలని సూచించింది.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రజల తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ... ముఖ్యంగా రద్దీ ప్రదేశాల్లో ఇతరులకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రిస్క్ ఎక్కువ ఉన్న దేశాలకు ప్రయాణాల విషయంలోనూ పునరాలోచించాలని పేర్కొంది. అయితే, HMPV కొత్తరకం వ్యాధి కాదని తెలిపింది. 2001లో కనుగొన్న ఈ వైరస్ న్యుమోవిరిడే కుటుంబానికి చెందింది.. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ కూడా అదే కుటుంబానికి చెందింది. ఇది సాధారణ జలుబు లేదా ఫ్లూ వంటి లక్షణాలు ఉండే ఇది ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే వైరస్.

 

ఇన్‌ఫ్లుయోంజా ఏ, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్-19 వంటి ఇతర వ్యాధులతో పాటు ప్రస్తుతం HMPV కేసులను చైనా ఎదుర్కొంటోంది. కొన్ని ప్రాంతాల్లోని ఆసుపత్రులు బాధితులతో కిక్కిరిసిపోయినట్టు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, చైనా అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితిని ప్రకటించలేదు. అన్ని వయసుల ప్రజలకు ఈ వైరస్ ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడినవారు, ఐదేళ్లలోపు చిన్నారులు ఈ వైరస్‌కు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. వ్యాధినిరోధకత తక్కువగా ఉన్నవారు ఆస్తమా బాధితులకు ముప్పు ఎక్కువే.

 

ఈ వైరస్‌కు కరోనా వైరస్ కంటే చాలా వేగంగా వ్యాపించగల సామర్థ్యం ఉన్నట్లు చైనాలోని పరిస్థితులు చెబుతున్నాయి. ఇంత తక్కువ సమయంలో కోవిడ్-19 వ్యాప్తి పెద్దగా లేదు, కానీ ఈ HMPV వైరస్ చాలా తక్కువ సమయంలోనే వ్యాప్తి చెందుతున్నట్లు చైనా అధికారులు చెబుతున్నారు. కరోనా కంటే ఇది ప్రమాదకరమని వెల్లడిస్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే.. 

 

పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్! 

 

ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్! 

 

ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు.. 

 

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! ఎప్పుడుఎందుకు..? 

 

లోకేశ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు భారీ శుభవార్త! ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. అకౌంట్లోకి డబ్బులుచెల్లింపు ఇలా! 

 

పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #China #Virus #Covid #Influenza