ఏపీ, హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్! ఆ రూట్‌లో అతిపెద్ద ఫ్లైఓవర్ ప్రారంభం.. ఇక దూసుకుపోవటమే..

Header Banner

ఏపీ, హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్! ఆ రూట్‌లో అతిపెద్ద ఫ్లైఓవర్ ప్రారంభం.. ఇక దూసుకుపోవటమే..

  Mon Jan 06, 2025 10:00        Politics

హైదరాబాద్ మహానగరాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య ట్రాఫిక్. రోజు రోజుకు పెరిగిపోతున్న నగర జనాభాతో.. ట్రాఫిక్ సమస్య కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. మరెన్ని ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించినా.. పరిస్థితి మాత్రం అలాగే ఉంటోంది. ట్రాఫిక్ కష్టాలను తీర్చే క్రమంలో.. నగరంలో ఇప్పటికే ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మించగా.. హైదరాబాద్ పరిధిలో అతిపెద్ద ఫ్లైఓవర్‌ నిర్మించారు. నెహ్రూ జులాజికల్ పార్క్ నుంచి ఆరాంఘర్ వరకు.. ఆరు లేన్ల ఫైఓవర్ నిర్మించారు. వివిధ కారణాల వల్ల ఈ ఫ్లైఓవర్ ప్రాజెక్టు.. ఏళ్ల తరబడి నిర్మాణం జరగ్గా.. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. హైదరాబాద్‌లోనే అతిపెద్ద రెండో ఫ్లైఓవర్‌గా రూపుదిద్దుకున్న ఈ ఫ్లైఓవర్‌ను.. సీఎం రేవంత్ రెడ్డి రేపు (జనవరి 06న) ప్రారంభించనున్నారు. నాలుగు కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో బైడైరెక్షనల్‌ మార్గంగా ఆరు లేన్లతో నిర్మితమైన ఈ అతిపెద్ద ఫ్లైఓవర్‌ కోసం ప్రభుత్వం ఏకంగా.. రూ.799 కోట్లు ఖర్చుచేసింది. ఈ ఫ్లైఓవర్ హైదరాబాద్ నగరంలోని పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ తర్వాత అత్యంత పొడవైనదిగా నిలుస్తుంది.

 

ఇంకా చదవండి: ఏపీలో కొత్త వైరస్ కేసులు.. వ్యాధి లక్షణాలు 3 నుంచి 10 రోజుల్లోగా..! ఆరోగ్యశాఖ స్పందన ఇదే..

 

ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే.. శాస్త్రీపురం, కాలాపత్తర్ వంటి కీలకమైన రద్దీ జంక్షన్‌లలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. జూపార్క్ నుంచి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు వెళ్లే వాహనదారులకు కూడా ట్రాఫిక్ఇబ్బందులు తప్పుతాయని ఆశిస్తున్నారు. తాడ్బన్, దానమ్మ హట్స్, హసన్ నగర్ జంక్షన్లలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగాల్సిన పని లేకుండా దూసుకెళ్లిపోవచ్చు. ఫలితంగా.. జూపార్క్‌‌‌‌‌‌‌‌కు వచ్చే సందర్శకులకు, పాతబస్తీవైపు వెళ్లే వాహనాలకు ప్రయాణం సులభతరం కానుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిన తరువాత.. నగరంలోని కీలక జంక్షన్లలో ట్రాఫిక్ జామ్ లేకుండా వేగంగా ప్రయాణం చేయడానికి వాహనదారులకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు.. ఉప్పల్ నుంచి నాగోల్, ఎల్బీ నగర్, బైరమల్‌గూడ, చాంద్రాయణ గుట్ట తదితర ప్రాంతాలకు వాహనాలు సులభంగా, వేగంగా ప్రయాణించే వెసులుబాటు కలుగుతుంది. ఈ ఫ్లైఓవర్ ద్వారా కాలుష్యాన్ని తగ్గించి, ఇంధన వాడకం కూడా తగ్గించడానికి ఎంతో తోడ్పడుతుంది.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే..

పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్!

ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్!

ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు..

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! ఎప్పుడు? ఎందుకు..?

లోకేశ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు భారీ శుభవార్త! ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. అకౌంట్లోకి డబ్బులు, చెల్లింపు ఇలా!

పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్..

లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా..

ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి!

ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!

గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు! ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ప్రస్తుతం స్టేటస్ ఏంటంటే!

ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు..

తల్లికి వందనం పథకం అమలుకు డేట్ ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!

నేడు (4/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #Telangana #NewHighwayLine #Government #HighWay