ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగితే నా పిల్లలకైనా చర్యలు తప్పవు! హోం మంత్రి కీలక వ్యాఖ్యలు!

Header Banner

ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగితే నా పిల్లలకైనా చర్యలు తప్పవు! హోం మంత్రి కీలక వ్యాఖ్యలు!

  Mon Jan 06, 2025 09:50        Politics

ప్రభుత్వానికి లేదా తెదేపా ప్రతిష్ఠకు నష్టం జరుగుతుందని భావిస్తే నా పిల్లలనైనా పక్కన పెడతాను' అని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇటీవల తన పీఏను తొలగించడంపై మాట్లాడుతూ.. "జగదీష్ అనే వ్యక్తి నా ప్రైవేటు పీఏ. నా సొంత డబ్బుతో జీతం ఇచ్చా. అతడిపై ఆరోపణలొచ్చాయి. అతన్ని హెచ్చరించా. అయినా ఫిర్యాదులు ఆగకపోవడంతో పది రోజుల క్రితమే ఉద్యోగం నుంచి తొలగించా..' అని వివరించారు. విశాఖ కేంద్ర కారాగారంలోని పెన్నా బ్లాక్ సమీపంలో సెల్ఫోన్లు దొరకడం, ఖైదీలకు జైలు సిబ్బంది గంజాయి సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఆదివారం ఉదయం మంత్రి ఆకస్మికంగా జైలు పరిశీలనకు వచ్చారు. వివిధ విభాగాలను తనిఖీ చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. 'వైకాపా ప్రభుత్వ హయాంలో జైలులో సెక్యూరిటీ, నిర్వహణ, ఉద్యోగుల బదిలీలను గాలికొదిలేశారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!



రాష్ట్రంలోని జైళ్లు, పోలీసు స్టేషన్లలో కొందరు అధికారులు, సిబ్బంది ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి విషయాన్నీ క్షుణ్నంగా పరిశీలించి చర్యలు చేపడుతోంది. జైలులో నర్మద బ్లాక్ సమీపంలో చిన్న గంజాయి మొక్క కనిపించింది. ఇకపై జైలులో ఏం జరిగినా తెలిసేలా అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీఐజీని ఆదేశించాం. తప్పు చేస్తే ఎంతటివారికైనా శిక్ష తప్పదు" అని మంత్రి హెచ్చరించారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



సెల్ఫోన్లపై తేలుస్తాం
‘ఇటీవల కారాగారంలో సెల్ఫోన్లు దొరకడంపై విచారణ ప్రారంభించాం. ఏ నంబరు సిమ్ ఉపయోగించారు, ఎవరెవరితో మాట్లాడారు.. అనే విషయాలు తేలుస్తాం. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. అవతలి వ్యక్తులూ కోర్టుకు హాజరయ్యేలా చూస్తాం. జైళ్లలో సిబ్బంది సంఖ్యను పెంచుతాం. సాంకేతికతతో నిఘా పటిష్ఠం చేస్తాం. గంజాయి కేసులో ఉన్నవారిని రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తాం' అని వివరించారు. సూపరింటెండెంట్ మహేశ్బాబు, డిప్యూటీ సూపరింటెండెంట్ సాయి ప్రవీణ్, ఆరిలోవ సీఐ మల్లేశ్వరావు, ఎస్సైలు మంత్రి వెంట ఉన్నారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీలో కొత్త వైరస్ కేసులు.. వ్యాధి లక్షణాలు 3 నుంచి 10 రోజుల్లోగా..! ఆరోగ్యశాఖ స్పందన ఇదే..


అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే..


పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్!


ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్!


ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు..


ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! ఎప్పుడు
ఎందుకు..?


లోకేశ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు భారీ శుభవార్త! ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. అకౌంట్లోకి డబ్బులు
చెల్లింపు ఇలా!


పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్..


లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా..


ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి!


ఏపీలో ఆ 
10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!


గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా 
7 ఎయిర్‌పోర్టులు! ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారుప్రస్తుతం స్టేటస్ ఏంటంటే!


ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 
46 ఏళ్ల రికార్డు బద్దలు..


తల్లికి వందనం పథకం అమలుకు డేట్ ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!


నేడు (
4/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #homeminister #cyber #fruad #scam #todaynews #flashnews #latestupdate