అమెరికా హెచ్ 1 బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!

Header Banner

అమెరికా హెచ్ 1 బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!

  Mon Jan 06, 2025 14:40        U S A

అమెరికా జారీ చేసే హెచ్ 1 బీ వీసాల విషయంలో భారతీయులు తమ జోరు కొనసాగిస్తున్నారు. అమెరికా ఇచ్చే మొత్తం హెచ్ 1 బీ వీసాల్లో ఐదో వంతు వీసాలు భారతీయులే దక్కించుకోవడం గమనార్హం. ఇక ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి సంస్థలు ముందు వరుసలో ఉన్నాయి. 2024 ఏప్రిల్‌- సెప్టెంబరు మధ్య ఇచ్చిన 1.3 లక్షల హెచ్‌ 1 బీ వీసాల్లో 24,766 వీసాలను భారత సంస్థలకు దక్కించుకున్నాయి.

 

ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అమెరికాకు వెళ్తూ ఉంటారు. అయితే అక్కడికి వెళ్లేవారికి అమెరికా ప్రభుత్వం రకరకాల వీసాలు జారీ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇందులో హెచ్ 1 బీ వీసాల గురించి బాగా చర్చ జరుగుతూ ఉంటుంది. ఇక ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు వెళ్లేవారిలో భారత్ నుంచి అత్యధిక సంఖ్యలో ఉంటారు. నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలు.. తాత్కాలికంగా హెచ్ 1 బీ వీసాలు అందిస్తూ ఉంటుంది. ఈ హెచ్ 1 బీ వీసాలతో భారత ఐటీ రంగం భారీగా డెవలప్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికా జారీ చేసే హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి లెక్కలు విడుదల చేసింది. అమెరికా జారీ చేసే ప్రతీ ఐదు హెచ్ 1 బీ వీసాల్లో ఒకరు భారతీయులే ఉంటున్నారని ఆ లెక్కల ద్వారా తెలుస్తోంది.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అమెరికా జారీ చేసే హెచ్ 1 బీ వీసాల్లో భారత ఐటీ కంపెనీల జోరు కనిపిస్తోంది. మొత్తం హెచ్ 1 బీ వీసాల్లో అయిదింటిలో ఒకవంతు భారతీయ ఐటీ సంస్థలే దక్కించుకుంటుండటం గమనార్హం. తాజాగా అమెరికా ఇమిగ్రేషన్‌ విభాగం గణాంకాలు విడుదల చేసింది. హెచ్ 1 బీ వీసాలు పొందడంలో ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ - టీసీఎస్‌ ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది ఏప్రిల్‌- సెప్టెంబరు నెలల మధ్య అమెరికా జారీ చేసిన 1.3 లక్షల హెచ్‌ 1 బీ వీసాల్లో.. 24,766 వీసాలను భారత సంతతి కంపెనీలే పొందాయని వెల్లడైంది.

 

ఇక అత్యధిక వీసాలు పొందిన వాటిలో అమెజాన్‌ కామ్‌ సర్వీసెస్‌ ఎల్‌ఎల్‌సీ ముందు వరుసలో నిలిచింది. ఈ సంస్థకు 9,265 హెచ్ 1 బీ వీసాలు లభించాయి. ఎల్ఎల్‌సీ తర్వాత ఇన్ఫోసిస్‌ రెండో స్థానంలో ఉంది. అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్‌ సంస్థ 6,321 హెచ్ 1 బీ వీసాలతో మూడో స్థానంలో నిలిచింది. ఇక భారతీయ సంస్థల విషయానికి వస్తే.. ఇన్ఫోసిస్‌ కంపెనీ 8,140 వీసాలతో తొలి స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత టీసీఎస్‌ 5,274 వీసాలు.. హెచ్‌సీఎల్‌ అమెరికా 2,953 ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని అమెరికా ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఈసారి 1,634 వీసాలతో విప్రో.. 1,199 వీసాలతో టెక్‌ మహీంద్రా కాస్త వెనుకంజలో ఉన్నట్లు తెలిపింది. అమెరికా కంపెనీలు తాత్కాలికంగా ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు హెచ్‌ 1 బీ వీసాలను జారీ చేస్తూ ఉంటుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే.. 

 

పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్! 

 

ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్! 

 

ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు.. 

 

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! ఎప్పుడుఎందుకు..? 

 

లోకేశ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు భారీ శుభవార్త! ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. అకౌంట్లోకి డబ్బులుచెల్లింపు ఇలా! 

 

పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants