ఏపీ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల షెడ్యూల్‌లో మార్పు! టెస్టులకు హాజరుకావాల్సిన కొత్త తేదీలు...!

Header Banner

ఏపీ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల షెడ్యూల్‌లో మార్పు! టెస్టులకు హాజరుకావాల్సిన కొత్త తేదీలు...!

  Mon Jan 06, 2025 16:07        Others

ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఫిబ్రవరి 1వ తేదీ వరకు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు నిర్వహిస్తున్నారు. అయితే పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి జనవరి 8 నుంచి 10వ తేదీ మధ్య జరగాల్సిన పీఎంటీ, పీఈటీ దేహదారుఢ్య పరీక్షలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాయిదా పడ్డాయి. వీటిని తిరిగి జనవరి 11 నుంచి 20వ తేదీన మధ్య నిర్వహించనున్నట్లు పోలీస్ క్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది.



ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!



శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు గతంలో జనవరి 8వ తేదీన దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఈ తేదీన జరగవల్సిన ఈవెంట్స్ వాయిదా వేసిన బోర్డు తిరిగి ఈ పరీక్షలను జనవరి 11వ తేదీన నిర్వహించనున్నారు. అలాగే అనంతపురంలో జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు జరగవల్సిన ఈవెంట్స్.. ఈ తేదీలకు బదులు జనవరి17, 18, 20వ తేదీల్లో జరగనున్నాయి. చిత్తూరులో జనవరి 8, 9 తేదీల్లో జరగవల్సిన ఈవెంట్స్.. జనవరి 17, 18 తేదీలకు వాయిదా పడ్డాయి. వైకుంఠ ఏకాదశి, శాంతి భద్రతల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వీటిని వాయిదా వేసినట్లు పోలీసు నియామక మండలి చైర్మన్ ఎం రవిప్రకాశ్ జనవరి 5న ఓ ప్రకటనలో తెలిపారు. ఆ మేరకు అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడిన విషయాన్ని గమనించాలని, జనవరి 11 నుంచి తిరిగి యథాతథంగా ఆయా జిల్లాల్లో ఈవెంట్స్ ప్రారంభమవుతాయని ఆయన స్పష్టం చేశారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



కాగా రాష్ట్రంలో 6100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్ విడుదలవగా.. గతేడాది జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. గతేడాది ఫిబ్రవరి 5న ప్రిలిమ్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. మొత్తం 95,209 మంది అభ్యర్థులు ఫిజికల్ టెస్టులకు ఎంపికయ్యారు. వీరిందరికీ డిసెంబర్ 30వ తేదీ నుంచి దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి. కాల్ లెటర్ లో తెలిపిన తేదీ, సమయానికి అభ్యర్థులు తప్పనిసరిగా మైదానంలోకి వెళ్లవల్సి ఉంటుంది. నిర్ణీత సమయానికి అభ్యర్థి హాజరు కాకపోతే అభ్యర్థులను మైదానంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 9441450639, 9100203323 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీలో కొత్త వైరస్ కేసులు.. వ్యాధి లక్షణాలు 3 నుంచి 10 రోజుల్లోగా..! ఆరోగ్యశాఖ స్పందన ఇదే..


అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే..


పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్!


ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్!


ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు..


ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! ఎప్పుడు
ఎందుకు..?


లోకేశ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు భారీ శుభవార్త! ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. అకౌంట్లోకి డబ్బులు
చెల్లింపు ఇలా!


పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్..


లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా..


ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి!


ఏపీలో ఆ 
10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!


గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా 
7 ఎయిర్‌పోర్టులు! ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారుప్రస్తుతం స్టేటస్ ఏంటంటే!


ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 
46 ఏళ్ల రికార్డు బద్దలు..


తల్లికి వందనం పథకం అమలుకు డేట్ ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!


నేడు (
4/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #police #recruitment #notification #todaynews #flashnews #latestupdate