విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో స్టార్ హీరో.. ఫ్యాన్స్‌లో ఆందోళన..

Header Banner

విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో స్టార్ హీరో.. ఫ్యాన్స్‌లో ఆందోళన..

  Mon Jan 06, 2025 18:14        Entertainment

త‌మిళ హీరో విశాల్‌కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విష‌యం తెలిసిందే. అందుకే ఆయ‌న న‌టించిన త‌మిళ సినిమాల‌న్నీ తెలుగులోకి డ‌బ్ అవుతుంటాయి. తెలుగు ప్రేక్ష‌కులు ఆయ‌న‌ను తెలుగు హీరోగానే భావిస్తారు. ఇక ఆయ‌న‌ నటించిన మదగజ రాజా చిత్రం చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. సుందర్ దర్శకత్వంలో తెరకెక్కిన‌ ఈ చిత్రాన్ని ఎట్టకేలకు సంక్రాంతికి తీసుకువస్తున్నారు. తాజాగా చెన్నైలో జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్ కి విశాల్ హాజరయ్యారు. కానీ ఈవెంట్‌లో ఆయ‌న‌ను చూసి అందరూ షాక్ అయ్యారు. విశాల్ గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయాడు. నడవడానికి కూడా ఇబ్బంది పడ‌టం క‌నిపించింది. ముఖం కూడా పూర్తిగా మారిపోయింది. బాగా సన్నగా అయిపోయిన విశాల్ వేదికపై మాట్లాడే స‌మ‌యంలో వణికిపోతూ కనిపించాడు. దీంతో విశాల్ ఆరోగ్యం పట్ల ఆయ‌న ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అస‌లు విశాల్ కి ఏమైందంటూ? అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా వైద్యులు ఆయ‌న హెల్త్ అప్‌డేట్ ఇచ్చారు. దాని ప్ర‌కారం విశాల్ వైర‌ల్‌ ఫీవర్ తో బాధపడుతున్నారు. అందుకే ఆయ‌న‌కు చికిత్స కొన‌సాగుతోంద‌ని, ప్ర‌స్తుతం పూర్తిగా బెడ్ రెస్ట్ లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఏది ఏమైనా విశాల్ త్వరగా కోలుకుని మునిపటిలా యాక్టివ్ గా ఉండాలని ఆయ‌న అభిమానులు కోరుకుంటున్నారు. 

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు (6/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ప్రయాణికులకు శుభవార్త: మరో రైలు మార్గానికి గ్రీన్ సిగ్నల్.. ఈ ప్రాంతాలన్నింటికీ కొత్త రైల్వేస్టేషన్లు..

AP: రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన మహిళలకు అదిరే గుడ్ న్యూస్! కీలక ప్రకటన - ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు!

ఏపీలో కొత్త వైరస్ కేసులు.. వ్యాధి లక్షణాలు 3 నుంచి 10 రోజుల్లోగా..! ఆరోగ్యశాఖ స్పందన ఇదే..

అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే..

పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్!

ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్!

ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు..

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! ఎప్పుడు? ఎందుకు..?

లోకేశ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు భారీ శుభవార్త! ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. అకౌంట్లోకి డబ్బులు, చెల్లింపు ఇలా!

పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove