ఏప్రిల్‌ 1 నుంచి అక్కడ అన్ని వాహనాలకు ఫాస్టాగ్‌ తప్పనిసరి! లేకపోతే నో ఎంట్రీ!

Header Banner

ఏప్రిల్‌ 1 నుంచి అక్కడ అన్ని వాహనాలకు ఫాస్టాగ్‌ తప్పనిసరి! లేకపోతే నో ఎంట్రీ!

  Tue Jan 07, 2025 18:28        India

దేశంలోని టోల్ ప్లాజాలలో టోల్‌ ట్యాక్స్‌ చెల్లించడానికి ఫాస్టాగ్‌ లను వినియోగిస్తున్నారు. వాహనానికి ఫాస్టాగ్‌ అంటించి ఉంటే టోల్‌ ప్లాజాల దగ్గర ఆగాల్సిన అవసరం ఉండదు. వాహనానికి అంటించి ఉన్న ఫాస్టాగ్‌ స్టిక్కర్‌ అటోమేటిక్‌గా స్కాన్‌ అవుతుంది. వాహనదారుడి బ్యాంకు ఖాతా నుంచి టోల్‌ రుసుము నేరుగా డిడక్ట్‌ అయ్యి టోల్‌ ప్లాజా ఖాతాలో చేరుతుంది. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

ఫాస్టాగ్‌ల ద్వారా కాకుండా నగదు రూపంలో టోల్‌ ఫీజు చెల్లించాలంటే ఒక్కో వాహనదారుడికి కనీసం ఒక నిమిషం సమయం పడుతుంది. దాంతో వాహనాదారులు బారులు తీరి చాలాసేపు వేచిచూడాల్సి వస్తుంది. అందుకే ఫాస్టాగ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి టోల్‌ ప్లాజాల దగ్గర రద్దీ కొంతమేరకు తగ్గింది. అయితే అందరూ ఫాస్టాగ్‌లను తీసుకోకపోవడంతో పూర్తిగా రద్దీ తగ్గడం లేదు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. టోల్‌ ప్లాజాల దగ్గర నగదు చెల్లింపుల కోసం వాహనాల క్యూలైన్‌లు లేకుండా చేయడం కోసం.. పూర్తిస్థాయిలో ఫాస్టాగ్‌లను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. అంటే అన్ని వాహనాల యజమానులు ఫాస్టాగ్‌లను తీసుకోవడం తప్పనిసరి చేసింది. దాంతో టోల్‌ ప్లాజాల దగ్గర నగదు చెల్లింపులకు ఫుల్‌స్టాప్‌ పెట్టబోతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ నూతన నిబంధనను అమల్లోకి తేనున్నట్లు ప్రకటించింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు! 

 

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు, నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో! 

 

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం! 

 

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం! 

 

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్! 

 

అమెరికా హెచ్ బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #India #Maharastra #FastTag