కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

Header Banner

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

  Thu Jan 09, 2025 19:26        Politics

ఆంధ్రప్రదేశ్లో తప్పుడు పత్రాలతో వేలాది మంత్రి ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. తప్పుడు మార్గంలో మెడికల్ సర్టిఫికెట్లు పొంది.. వాటితో దరఖాస్తు చేసుకుని పెన్షన్ల రూపంలో ప్రభుత్వ సొమ్ము నొక్కేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.. అయితే, ఏపీలో 8 లక్షల 18 వేల పెన్షన్ల కు సంబంధించి వేరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.. దివ్యంగుల పెన్షన్.. వివిధ వ్యాధులకు సంబంధించి ఇబ్బంది పడుతున్న వారి పెన్షన్లపై ప్రధానంగా దృష్టిసారించింది ప్రభుత్వం.. అందులో భాగంగా తనిఖీలు నిర్వహిస్తోంది.. కిడ్నీ, హార్ట్ ప్రాబ్లెమ్, తలసేమియా.. ఇలా వివిధ కేటగిరీలుగా పెన్షన్ పంపిణీ జరుగుతోంది. నకిలీ సర్టిఫికెట్లతో పెన్షన్ తీసుకునేవారిని గుర్తించే పని పడిపోయింది ప్రభుత్వం.



ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!



అయితే, మూడు నెలల పాటు ఈ తనిఖీ ప్రక్రియ కొనసాగించనున్నారు.. జిల్లా స్థాయి అధికారులు మెడికల్ టీమ్, ఒక డిజిటల్ అసిస్టెంట్ సహాయంతో పెన్షన్ తనిఖీలు కొనసాగిస్తున్నారు.. ఇక, తనిఖీలు పూర్తయిన తర్వాత ఒక వేళ అవి నకిలీ సర్టిఫికెట్లు అని గుర్తిస్తే ముందుగా సంబంధిత పెన్షనర్లకు నోటీసులు ఇవ్వనున్నారు అధికారులు.. ఆ తర్వాత పెన్షన్ తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.. తనిఖీ చేసిన డేటా మూడు నెలల తర్వాత ప్రకటించాలా...? లేక ప్రతి 15 రోజులకు ప్రకటించి.. నిర్ణయం తీసుకోవాలా? అనే విషయంపై చర్చిస్తోంది ప్రభుత్వం.. కాగా, వైసీపీ హయాంలో భారీ సంఖ్యలో అనర్హులకు పెన్షన్లు నమోదు చేశారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది.. అంతేకాదు.. అవి నకిలీ పెన్షన్లు అని తేలితే.. లబ్ధిదారుల నుంచి.. పెన్షన్ల మొత్తాన్ని కూడా రికవరీ చేస్తామంటూ కూటమి నేతలు వ్యాఖ్యానించిన విషయం విదితమే..



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలు, సూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వంచంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

 

ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇక వారికీ పండగే పండగ! ఇకపై ఆ పరీక్షలు రద్దు!

 

వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం... జగన్ సోదరుడు మృతి!

 

టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్ చల్.. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..!

 

నేడు (8/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు మోదీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. నెలకు రూ.7 వేలు! 18 నుంచి 70 ఏళ్ల లోపు.. ఈ స్కీం ఎలా అప్లై చేయాలంటే!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

 

వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేతమాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు..

 

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #pension #checking #fakenames #todaynews #flashnews #latestupdate