ఖాతాదారులకు రోజుకు రూ.100 చెల్లించనున్న బ్యాంకులు! రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం!

Header Banner

ఖాతాదారులకు రోజుకు రూ.100 చెల్లించనున్న బ్యాంకులు! రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం!

  Thu Jan 09, 2025 21:30        Business

బ్యాంకు ఖాతాదారులకు అదిరే శుభవార్త అందించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫిర్యాదులు అందిన తర్వాత ఆలస్యమైతే బ్యాంకులు తమ ఖాతాదారులకు రోజుకు రూ.100 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. దీంతో బ్యాంకులు నిర్ణీత సమయంలోపు ఖాతాదారులకు సేవలందించనున్నాయని తెలిపింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

 

బ్యాంక్ ఖాతాదారులకు వేగవంతమైన సేవలు అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిబంధనలు అమలులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఎలాంటి సేవల్లోనూ జాప్యం జరగకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. నిబంధనలు ఉల్లంఘించి సేవలు అందించడంలో జాగు చేస్తే బ్యాంకులపై జరిమానాలు విధిస్తోంది. ఖాతాదారులకు పరిహారం అందించేలా ఆదేశిస్తోంది. తాజాగా అలాంటి నిర్ణయమే ఒకటి తీసుకుంది. బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఆర్‌బీఐ కొత్త రూల్స్ ప్రకారం సేవల్లో జాప్యం జరిగితే బ్యాంకులో రోజుకు రూ.100 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

 

బ్యాంకులు, క్రెడిట్ బ్యూరోలు తమ కస్టమర్లకు అందించే సేవల్లో ఆలస్యం చేస్తున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థలు, బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలకు కొత్త ఆదేశాలు జారీ చేసింది. తమ ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు అందిన నెల రోజులు (30 రోజుల్లో)గా సమస్య పరిష్కరించాలని కోరింది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడంలో ఆలస్యం చేసినట్లయితే ఆ తర్వాత సమస్య పరిష్కారం అయ్యే వరకు రోజుకు రూ.100 చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ సంస్థలు తమ కస్టమర్ల క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కోరినప్పుడు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థలు సదరు ఖాతాదారులకు ఇ-మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయాలని ఆర్బీఐ ఆదేశించింది. అలాగే బ్యాంకులు సైతం ఖాతాదారులు క్రెడిట్ కార్డు డీఫాల్టర్‌గా మారినప్పుడు ముందుగా సమాచారం అందించాలని స్పష్టం చేసింది. అలాగే క్రెడిట్ హిస్టరీలో ఏవైన పొరపాట్లు జరిగాయని కస్టమర్లు ఫిర్యాదు చేసినప్పుడు అప్డేట్ చేసిన సమాచారాన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థలకు పంపించడంలో విఫలమైనట్లు తేలితే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. 21 రోజుల్లోగా ఈ పని పూర్తి చేయాలని బ్యాంకులను ఆదేశించింది. లేదంటే జరిమానా కట్టాల్సి వస్తుందని పేర్కొంది.

 

ప్రస్తుతం మన దేశంలో నాలుగు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థలు ఉన్నాయి. సిబిల్, సీఆర్ఐఎఫ్, ఈక్విఫాక్స్, ఎక్స్‌పీరియన్ సంస్థలు క్రెడిట్ సమాచారాన్ని అందిస్తున్నాయి. ఈ సంస్థలు సైతం ఫిర్యాదులు అందుకున్న తర్వాత 30 రోజుల్లోగా పరిష్కరించాలి. ఫిర్యాదుకు సంబంధించిన అప్డేట్ కస్టమర్లకు తెలపాలి. ఫిర్యాదు తిరస్కరిస్తే సంబంధించిన సమాచారం అందించాలి. క్రెడిట్ సమాచారంలో పొరపాట్ల కారణంలో క్రెడిట్ స్కోర్ తగ్గి రుణాలు తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తమ సమచారాన్ని అప్డేట్ చేసుకునేందుకు ఖాతాదారులు బ్యాంకులు, ఆర్థిక సంస్థల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తుంది. ఈ సమస్య ఆర్బీఐ దృష్టికి వెళ్లిన క్రమంలో ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలు, సూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వంచంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

 

ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇక వారికీ పండగే పండగ! ఇకపై ఆ పరీక్షలు రద్దు!

 

వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం... జగన్ సోదరుడు మృతి!

 

టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్ చల్.. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Business #RBI #BankAccounts #Banks