టెలిగ్రామ్ గోప్యతకు షాక్... పెద్ద ఎత్తున డేటా సేకరణ! నివేదికలో కీలక వివరాలు!

Header Banner

టెలిగ్రామ్ గోప్యతకు షాక్... పెద్ద ఎత్తున డేటా సేకరణ! నివేదికలో కీలక వివరాలు!

  Thu Jan 09, 2025 22:05        U S A

ప్రస్తుత సాంకేతిక యుగంలో సమాచారమే  ఆయుధం. కొన్ని ప్రైవేటు సంస్థలు, ఏజెన్సీలు.. చాలా మంది డేటాను సేకరించి, వినియోగించుకుంటున్నాయి. తాజాగా గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రముఖ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్'  నుంచి అమెరికా  ప్రభుత్వం డేటాను సేకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టెలిగ్రామ్ తన పారదర్శక నివేదికలో  వెల్లడించింది. గతేడాది 900 రిక్వెస్టులు పెట్టి... 2,253 మంది యూజర్ల డేటాను అమెరికా ప్రభుత్వం సేకరించిందని అందులో పేర్కొంది. తొలి 9 నెలల్లో 14 రిక్వెస్టులు రావడంతో 108 మంది డేటాను ప్రభుత్వానికి అందజేసినట్లు టెలిగ్రామ్ వెల్లడించింది. గతేడాది టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ అరెస్టయిన తర్వాత అమెరికా ప్రభుత్వం చేసిన దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024 ఆగస్టులో పావెల్ దురోవ్ ఫ్రాన్స్లో అరెస్టయిన సంగతి తెలిసిందే.



ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!



టెలిగ్రామ్ ద్వారా హవాలా మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, చిన్నారులపై లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారం చేరవేస్తున్నారన్న ఆరోపణలతో పారిస్ ఎయిర్పోర్టులో ఫ్రాన్స్ అధికారులు అతడిని అరెస్టు చేశారు. దురోవ్ అరెస్టు తర్వాత ప్రైవసీ పాలసీలో టెలిగ్రామ్ మార్పులు చేసింది. ప్రభుత్వం నుంచి అధికారికంగా రిక్వెస్ట్ వస్తే.. యూజర్ల ఐపీ, ఫోన్ నెంబర్ లాంటి నిర్దిష్ట సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేస్తోంది. అప్పటి వరకు టెలిగ్రామ్ పాలసీ ప్రకారం.. యూజర్ల వివరాలను ప్రభుత్వంతో పంచుకునే వీలు లేదు. గతేడాది చివరి త్రైమాసికంలో ఈ పాలసీలో మార్పులు చేయడంతో పలువురు వ్యక్తుల సమాచారం కావాలంటూ అమెరికా ఎన్ఫోర్స్మెంట్ నుంచి టెలిగ్రామ్కు దరఖాస్తుల సంఖ్య ఒక్కసారిగా పెగింది.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



టెలిగ్రామ్ తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీలో మార్పుతో యూజర్లలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమ వ్యక్తిగత సమాచారంపై ప్రభుత్వం కన్నేసి ఉంచుతోందా? సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత వివరాలు ఉంచాలా? వద్దా? అనే విషయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భద్రతపరమైన సమస్యలు తలెత్తే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గోప్యతకు ప్రాధాన్యత ఇచ్చే ఫ్లాట్ఫామ్లలోనూ వినియోగదారుల డేటా సేకరణ జరుగుతోందనడానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వ డిమాండ్లకు కట్టుబడి ప్రైవేటు సంస్థలు తమ యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లకుండా డేటాకు ఎంత వరకు రక్షణ ఇవ్వగలవన్న దానిపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ తరహా చర్యలను డిజిటల్ గోప్యతకు సవాల్ అభివర్ణిస్తున్నారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలు, సూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వంచంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

 

ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇక వారికీ పండగే పండగ! ఇకపై ఆ పరీక్షలు రద్దు!

 

వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం... జగన్ సోదరుడు మృతి!

 

టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్ చల్.. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..!

 

నేడు (8/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు మోదీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. నెలకు రూ.7 వేలు! 18 నుంచి 70 ఏళ్ల లోపు.. ఈ స్కీం ఎలా అప్లై చేయాలంటే!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

 

వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేతమాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు..

 

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #telegram #fruad #scam #datastoring #america #todaynews #flashnews #latestupdate