ఈ కారణాలతో కూడా క్రెడిట్ స్కోరు తగ్గుతుంది తెలుసా? ఏటీఎం నుంచి డబ్బులు తీసినా...!

Header Banner

ఈ కారణాలతో కూడా క్రెడిట్ స్కోరు తగ్గుతుంది తెలుసా? ఏటీఎం నుంచి డబ్బులు తీసినా...!

  Thu Jan 09, 2025 11:39        Business

క్రెడిట్ కార్డుల వినియోగం ఒకప్పటితో పోలిస్తే ఇటీవలి కాలంలో పెరిగిపోయిందని చెప్పొచ్చు. బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు క్రెడిట్ కార్డుల్ని ఈజీగా ఇచ్చేస్తున్నాయి. మంచి పరిమితి కూడా ఇస్తున్నాయి. అయితే చాలా మందికి క్రెడిట్ స్కోరుపై ఎన్నో అపోహలు ఉంటాయి. మంచి క్రెడిట్ స్కోరుతోనే లోన్లు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. మరి క్రెడిట్ స్కోరు ఎలాంటి కారణాలతో తగ్గుతుందో తెలుసుకుందాం. 

 

మీరు బ్యాంకుల్లో లోన్ల కోసం చూస్తున్నారా.. అయితే తప్పనిసరిగా మంచి క్రెడిట్ స్కోరు ఉండాలి. తక్కువ క్రెడిట్ స్కోరుతో లోన్లు పొందడం కష్టం. ఇంకా వడ్డీ రేట్లు కూడా ఎక్కువగా ఉండొచ్చు. అందుకే మెరుగైన క్రెడిట్ స్కోరు నిర్వహించడం అవసరం. ఎన్నో కారణాలు క్రెడిట్ స్కోరు తగ్గేందుకు కారణం అవుతుంటాయి. దీంట్లో కీలకమైన వాటిని మనం ఇప్పుడు తెలుసుకొని.. వాటిని ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. క్రెడిట్ కార్డు బకాయిల మాదిరిగానే .. లోన్ ఈఎంఐ డిఫాల్ట్స్ లేదా ఆలస్య చెల్లింపులు వంటివి కూడా మీ సిబిల్ స్కోరును దెబ్బతీస్తాయని చెప్పొచ్చు. మీ క్రెడిట్ రిపోర్టులోనే ఇవన్నీ ఉంటాయి. అందుకే మెరుగైన క్రెడిట్ స్కోరు మెయింటెయిన్ చేయాలంటే ఈఎంఐల్ని సకాలంలో చెల్లించాలి.

 

క్రెడిట్ రిపోర్ట్ అనేది ప్రతి ఒక్కరికీ కీలకం. అందుకే దీన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మీ క్రెడిట్ రిపోర్టులో లోన్ రీపేమెంట్ వంటి వివరాలు సరిగ్గా నమోదు కాకపోవచ్చు కూడా. ఇది కూడా మీ క్రెడిట్ స్కోరును తగ్గించొచ్చు. అందుకే ముందుగానే తనిఖీ చేయడం ద్వారా ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవచ్చు.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

రుణ గ్రహీత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో బ్యాంక్ రుణ మొత్తంలో కొంత భాగం తగ్గించుకొని సెటిల్మెంట్ చేసుకునే ఆప్షన్ ఇస్తుంది. రుణ గ్రహీతకు ఇది ఆకర్షణీయంగానే అనిపించొచ్చు. కానీ ఇది కూడా మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపుతుంది. అందుకే ఇలా లోన్ సెటిల్మెంట్ కంటే ముందు లోన్ తీర్చేందుకు బ్యాంకుల్ని మరికొంత సమయం కోరడం మేలు.

 

మీ దగ్గర ఉన్న ప్రధాన క్రెడిట్ కార్డుకు అదనంగా కుటుంబ సభ్యుల కోసం చాలా మంది యాడ్ ఆన్ క్రెడిట్ కార్డు తీసుకుంటుంటారు. ఈ ఖర్చు కూడా ప్రాథమిక కార్డుకే కలుస్తుంది. అందుకే ఇక్కడ ఒకవేళ యాడ్ ఆన్ కార్డుపై ఎక్కువ ఖర్చు చేస్తే ప్రాథమిక కార్డు దారుడిపై అధిక భారం పడే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ పరిమితి విధించడం మంచిది.

 

క్రెడిట్ కార్డులతో పరిమితి మేరకు ఏటీఎంల నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇలాంటి నగదు అడ్వాన్స్‌లపై 3 నుంచి 5 శాతం వరకు ఛార్జీలు ఉంటాయి. ప్రతి నెల ఇక్కడ 3 నుంచి 4 శాతం వరకు వడ్డీ కూడా పడుతుంది. ఇలా అధిక వడ్డీ భారం వల్ల పేమెంట్స్ ఆలస్యం కావొచ్చు లేదా మిస్ చేయొచ్చు. ఇది కూడా క్రెడిట్ స్కోరుపై ఎఫెక్ట్ చూయిస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలా క్రెడిట్ కార్డులతో ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రాకు వీలైనంత దూరంగా ఉండటం మేలు చేస్తుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలు, సూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వంచంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

 

ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇక వారికీ పండగే పండగ! ఇకపై ఆ పరీక్షలు రద్దు!

 

వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం... జగన్ సోదరుడు మృతి!

 

టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్ చల్.. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Business #CreditCards #DebitCards #SecuredCredit