ప్ర‌వాసీ భార‌తీయ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ! ఆ ట్రైన్ ప్ర‌త్యేక‌త‌ ఏంటి?

Header Banner

ప్ర‌వాసీ భార‌తీయ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ! ఆ ట్రైన్ ప్ర‌త్యేక‌త‌ ఏంటి?

  Thu Jan 09, 2025 12:37        India

విదేశీ భార‌తీయుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వాసీ భార‌తీయ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించింది. భువ‌నేశ్వ‌ర్‌లో జ‌రుగుతున్న 18వ ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ సంద‌ర్భంగా ఈ రైలును వ‌ర్చువ‌ల్‌గా ప్ర‌ధాని మోదీ ప్రారంభించారు. ఎన్ఆర్ఐ టూరిస్టుల కోసం ఈ రైలును స్టార్ట్ చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేష‌న్ నుంచి ఈ రైలు బ‌య‌లుదేరింది. మూడు వారాల జ‌ర్నీ ఉంటుంది. దేశంలోని ప‌లు సంప్ర‌దాయ‌, మ‌త‌ప‌ర‌మైన ప్ర‌దేశాల‌ను ఆ రైలు చుట్టివ‌స్తుంది. 

 

ప్ర‌వాసీ భార‌తీయ ఎక్స్‌ప్రెస్‌ను.. ప్ర‌త్యేక టూరిస్టు రైలును రూపొందించారు. విదేశాల్లో ఉన్న భార‌తీయుల కోసం ఈ టూరిస్టు రైలు కాన్సెప్ట్‌ను డెవ‌ల‌ప్ చేశారు. 45 ఏండ్ల నుంచి 65 ఏండ్ల మ‌ధ్య ఉన్న‌వారు ఈ రైలులో ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. త‌మ చారిత్రాత్మ‌క మూలాల‌ను ట‌చ్ చేసే రీతిలో ఈ రైలు రూట్‌ను క్రియేట్ ఛేవారు. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఢిల్లీ నుంచి బ‌య‌లుదేరిన రైలు.. ఆ త‌ర్వాత అయోధ్య చేరుకుంటుంది. అక్క‌డ నుంచి పాట్నా, గ‌యా, వారణాసి, మ‌హాబ‌లిపురం, రామేశ్వ‌రం, మ‌ధురై, కొచ్చి, గోవా, ఎక్తా న‌గ‌ర్‌(కేవ‌డియా), అజ్మీర్‌, పుష్క‌ర్‌, ఆగ్రా ప‌ట్ట‌ణాల‌ను ఆ రైలు చుట్టువ‌స్తుంది. ఈ రైలులో 156 మంది ప్ర‌యాణికుల ట్రావెల్ చేసే అవ‌కాశం ఉంటుంది. విదేశాంగ శాఖ‌, భార‌తీయ రైల్వే, ఐఆర్సీటీసీ క‌లిసి .. ప్ర‌వాసీ రైలును స్టార్ట్ చేశారు. వివిధ దేశాల్లోని భార‌తీయ ఎంబ‌సీల నుంచి ఈ రైలు ప్ర‌యాణికుల కోసం ద‌ర‌ఖాస్తు చేశారు. త‌క్కువ ఆదాయం ఉన్న వారికి ఈ రైలులో ప్ర‌యాణించే అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. 

 

విదేశాంగ శాఖ ప్ర‌కారం.. రైలు టూరుకు చెందిన అన్ని ఖ‌ర్చుల‌ను కేంద్ర ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది. ఆయా దేశాల నుంచి ఇండియాకు వ‌చ్చే ప్ర‌వాసీల రిట‌ర్న్ విమాన ఖ‌ర్చులో 90 శాతం కూడా ప్ర‌భుత్వ‌మే పెట్టుకోనున్న‌ది. ప్ర‌యాణికులు కేవ‌లం 10 శాతం ఛార్జీ మాత్ర‌మే చెల్లించాల్సి ఉంటుంది. ఈ రైలులో టూర్ చేసే వారికి 4స్టార్ హోట‌ల్ అకామిడేష‌న్ ఇవ్వ‌నున్నారు. రైలు ఆవిష్క‌ర‌ణ గురించి మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ ఓ ట్వీట్ చేశారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలు, సూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వంచంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

 

ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇక వారికీ పండగే పండగ! ఇకపై ఆ పరీక్షలు రద్దు!

 

వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం... జగన్ సోదరుడు మృతి!

 

టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్ చల్.. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #India #PravasiDivas #Modi #ExpressTrain