ఇంట్లోని పైపులు, షవర్‌పై నీటి మరకలున్నాయా? ఇలా క్లీన్ చేస్తే కొత్తగా మెరుస్తాయి!

Header Banner

ఇంట్లోని పైపులు, షవర్‌పై నీటి మరకలున్నాయా? ఇలా క్లీన్ చేస్తే కొత్తగా మెరుస్తాయి!

  Sat Jan 18, 2025 11:48        Life Style

రెగ్యులర్‌గా మనం ఇంటిని క్లీన్ చేస్తాం. కానీ, ఇంట్లోని చిన్న చిన్న పైప్స్, షవర్స్ వంటివి క్లీన్ చేయం. దీంతో, వాటిపై నీళ్లు పడి మరకలు అవుతుంటాయి. దీంతో చూడ్డానికి సరిగా కనిపించవు. వాటిని క్లీన్ చేయాలంటే ఏం చేయాలో తెలుసుకోండి. 

 

మనం రెగ్యులర్‌గా ఇంటిని క్లీన్ చేస్తాం. కానీ, కొన్నింటిని అంతగా పట్టించుకోం. అందులో ఇంటి నల్లాలు, బాత్‌రూమ్ షవర్స్ ఉంటాయి. దీంతో నల్లా పైప్‌లు మరకలు, రస్ట్ పట్టి చూడ్డానికి ఇబ్బందిగా మారతాయి. ఇక షవర్ నుంచి ఎక్కువగా నీరు రాదు. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. వాటితో చాలా వరకూ మరకలు తగ్గిపోతాయి. చూడ్డానికి చక్కగా ఉంటాయి. పైగా వీటిని క్లీన్ చేయడానికి సొల్యూషన్స్‌ని బయట కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే పదార్థాలతోనే క్లీన్ చేయొచ్చు. ఆ పదార్థాలేంటి? వీటితో పైపులని ఎలా క్లీన్ చేయాలో తెలుసుకోండి.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఓ చిన్న గిన్నెలో నీరు పోసి గిన్నెలు కడిగేందుకు వాడే డిష్ వాష్ సోప్, లిక్విడ్‌ని అందులో వేసి కలపండి. తడిసిన పైపులపై దీనిని రాయాలి. కాసేపు ఉంచి ఆ తర్వాత బ్రష్‌తో పైపులని క్లీన్ చేయాలి. దీంతో పైపులు కొత్తవాటిలా మెరుస్తాయి. మనం రోజూ వాడే టూత్‌పేస్ట్‌ని కూడా ట్యూబ్‌లు, పైపులపై మరకలు ఉండే చోట రాయాలి. కాసేపు అలానే ఉంచాలి. ఆ తర్వాత వాటిని క్లీన్ చేయాలి. దీంతో ఈజీగా మరకలు పోవడమే కాదు. పైపులు కొత్తవాటిలా మెరుస్తాయి. 

 

ఇక బాత్‌రూమ్‌లో షవర్, పైపులపై నీటి మరకలు పడుతుంటాయి. వీటిని క్లీన్ చేసేందుకు ఓ గిన్నెలో డిటర్జెంట్ పొడిని వేయాలి. అందులో నిమ్మరసం పిండాలి. దీనిని పేస్టులా చేయాలి. పైపులకి దీనిని అప్లై చేసి 5 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత స్క్రబ్‌తో రుద్ది మరకల్ని క్లీన్ చేయాలి. 4 చెంచాలా బేకింగ్ సోడా, 2 చెంచాల నిమ్మరసం, డిటర్జెంట్ పౌడర్, అరకప్పు వెనిగర్ తీసుకోవాలి. వీటన్నింటిని ఓ గిన్నెలో పోయాలి. అందులోనే కప్పు నీరు పోయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ పాలిథిన్ కవర్‌లో పోయాలి. దీనిలో షవర్ మునిగేలా కట్టండి. రాత్రంతా అలానే ఉంచండి. మరుసటి ఉదయం కవర్ తీసేసి పాడైపోయిన టూత్‌బ్రష్‌తో మొత్తం ఓ సారి క్లీన్ చేయండి. దీంతో షవర్ మొత్తం క్లీన్ అవుతుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. రూ.11500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం! ఇక వారికి పండగే పండగ!

  

2025 జనవరి మహీంద్రా కార్లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!

 

మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందావెంటనే చెక్ చేసుకోండి! 

 

ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్! ఆ బాటిల్‌పై భారీగా తగ్గింపు..

  

ఇంటి దగ్గరే ఈజీగా ఇలా చేయండి చాలు.. ఈ ఆహారాలతో - మీ కిడ్నీలు పూర్తిగా క్లీన్ అయిపోతాయి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #LifeStyle #Home #Cleaning #Washrooms