రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వ నుంచి బిగ్ అప్‌డేట్! ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు!

Header Banner

రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వ నుంచి బిగ్ అప్‌డేట్! ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు!

  Sat Jan 18, 2025 19:16        Politics

నిరు పేద, పేద కుటుంబాలకి ఇప్పటికి రేషన్ కార్డే ధిక్కు. అలాంటి రేషన్ కార్డు జారీలో గత ప్రభుత్వం జాప్యం చేసింది. అయితే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆ పనిని భుజాన వేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని ప్రణాళిక చేస్తుంది. అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా ప్రభుత్వ యంత్రంగాతో రాష్ట్ర నాయకులు చర్చలు జరుపుతున్నారు. నిష్పక్షపాతంగా ఈ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వ యోచిస్తుంది.

 

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేసిన కులగణన సర్వే ఆధారంగా ఈ నెల నుంచే రేషన్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రేడ్డి సమక్షంలో జరిగిన మీటింగ్‌లో తెలిపారు. ఆ తర్వాత ఇతర మంత్రులు తాజా అప్‌డేట్స్ ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడే ఇంకో సమస్య వచ్చింది. కులగణనలో రేషన్ కార్డు గురించి వెల్లడించని వారి పరిస్థితి ఏంటి? అలాగే ఇటివల వివాహం చేసుకున్న పేద వారి పరిస్థితి ఏంటి? అలాగే ఒక వేళ కులగణన సర్వేల తప్పులు జరిగిన మా పరిస్థితి ఏంటని ప్రజల నుంచి ప్రభుత్వానికి నిత్యం వినతులు వస్తున్నాయి.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ప్రజల నుంచి వచ్చే వినతులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అర్హులై ప్రతి పేద వారికి రేషన్ కార్డులు అదిస్తామని తెలిపారు. ఒక వేళ ఎవరైనా జాబితాలో పేరు రాకుంటే ఏం ఆందోళన చెందవద్దని అన్నారు. ఎందుకంటే త్వరలో అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేస్తాం అన్నారు. ఆ గ్రామ సభల్లో మీరు దరఖాస్తు చేసుకుంటే అర్హతను బట్టి ఇస్తామని పేర్కొన్నారు. కుల గణన ఆధారంగా మీ అర్హతలు అధికారుల పరిశీలిస్తారని, గ్రామ సభల్లో పూర్తి వివరాలు వెల్లడి అవుతాయని తెలిపారు.

 

ఇక సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు సమాచారం నమ్మవద్దని పేర్కొన్నారు. కొత్తవి వస్తే పాత రేషన్ కార్డులు తొలగిస్తామని జరుగుతున్న ప్రచారం ఆసత్యమని కొట్టిపారేశారు. ఎవరైన కొత్తగా ఇంటి సభ్యులు అయితే వారిని పాత రేషన్ కార్డులోనే జత చేస్తామని హామీ ఇచ్చారు. అయితే పూర్తి వివరాలను మీ ఊరిలో జరిగే గ్రామ సభల్లో వెల్లడించాలని తెలిపారు. ఈ జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ఇప్పటికే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల 81 లక్షల మందికి ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా ఎన్ని రేషన్ కార్డులు ఇస్తారు. అర్హతలను ఏవిధంగా నిర్ణయిస్తారో చూడాలి. అయితే రేషన్ కార్డులు పొందడానికి అర్హత ఉండి.. రాకపోతే సంబంధిత అధికారులకు విజ్ఞప్తి పత్రాలు ఇవ్వొచ్చని మంత్రులు చెబుతున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. రూ.11500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం! ఇక వారికి పండగే పండగ!

  

2025 జనవరి మహీంద్రా కార్లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!

 

మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందావెంటనే చెక్ చేసుకోండి! 

 

ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్! ఆ బాటిల్‌పై భారీగా తగ్గింపు..

  

ఇంటి దగ్గరే ఈజీగా ఇలా చేయండి చాలు.. ఈ ఆహారాలతో - మీ కిడ్నీలు పూర్తిగా క్లీన్ అయిపోతాయి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP